English   

ప‌వ‌న్ కు మైత్రితో దోస్తానా క‌ట్..

Pawan-Kalyan

స్నేహితుల‌కు ప‌వ‌న్ హ్యాండివ్వ‌డం ఏంటి.. ఇంత‌కీ ఎవ‌రా స్నేహితులు అనుకుంటున్నారా..? ఇక్క‌డ స్నేహితులు అంటే మైత్రి మూవీ మేక‌ర్స్ అని. మైత్రి అంటే స్నేహ‌మే క‌దా మ‌రి..! వీళ్ళ‌తో ఓ  సినిమా చేయ‌డానికి ప‌వ‌న్ ఎప్పుడో క‌మిట‌య్యాడు. అయితే ఇప్ప‌టికీ అది పూర్తికాలేదు. ఇప్పుడు చూస్తే ఇక‌పై సినిమాలు చేయ‌న‌ని ప‌వ‌న్ స్ప‌ష్టం చేసాడు. ఇదే ఇప్పుడు మైత్రిని టెన్ష‌న్ పెడుతుంది. ప‌వ‌న్ తో సినిమా చేయాల‌ని ఎప్ప‌ట్నుంచో క‌ల‌లు కంటోన్న నిర్మాత‌ల‌కు ఇప్పుడు దిమ్మ‌తిరిగే షాకిచ్చాడు ప‌వ‌ర్ స్టార్. పైగా ఇప్పుడు ప‌వ‌న్ చెప్పినా వినే మూడ్ లో కూడా లేడు. ఈయ‌న గ‌త సినిమా అజ్ఞాత‌వాసి ఎంత పెద్ద డిజాస్ట‌రో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఆస‌క్తి లేకుండా సినిమాలు చేస్తే ఇలాగే ఉంటుంద‌ని ప‌వ‌న్ కు కూడా అర్థ‌మైన‌ట్లుంది. అందుకే ఇక చాల‌నుకుంటున్నాడు. బ‌య్య‌ర్ల‌కు 60 కోట్ల‌కు పైగానే ముంచేస్తున్నాడు అజ్ఞాత‌వాసి. ఇదిలా ఉంటే ప‌వ‌న్ ఇక‌పై సినిమాలు చేయ‌డు అనే ప్ర‌చారం గ‌ట్టిగానే జ‌రుగుతుంది.
 
ఆయ‌న సినిమాలు చేయ‌న‌ని చెప్పినా కూడా అభిమానులు మాత్రం ఇంకా ఒక్క సినిమా చేస్తే బాగున్ను అనుకుంటున్నారు. పైగా మైత్రి మూవీ మేక‌ర్స్ కూడా ప‌వ‌న్ ను త‌మ సినిమా చేయాల్సిందిగా కోరుతున్నారు. ఈ విష‌యంపై ప‌వ‌న్ మ‌న‌సు కూడా ఊగిస‌లాడుతున్న‌ట్లు తెలుస్తుంది. ఇప్పుడైతే ఈ చిత్రం క‌చ్చితంగా ఉండ‌దు. కాక‌పోతే ఎన్నిక‌ల త‌ర్వాత ఉంటే ఉండొచ్చేమో తీసిపారేయ‌లేం. కానీ అప్ప‌టికి కూడా ప‌వ‌న్ క‌చ్చితంగా చేస్తాడు అనే గ్యారెంటీ లేదు. ఏడాదిన్న‌ర కిందే ఈ నిర్మాతల నుంచి ప‌వ‌న్ 12 కోట్లు అడ్వాన్స్ తీసుకున్నాడు. ఇప్పుడు అది వెన‌క్కి ఇచ్చేసాడ‌ని తెలుస్తుంది. మీకు ఇష్ట‌మొచ్చిన‌పుడే సినిమా చేయండి అని మైత్రి చెప్పినా కూడా చేసేలా లేడు ప‌వ‌న్. అందుకే ఈ గోల‌ల‌న్నీ ఎందుకు అని అడ్వాన్స్ తిరిగిచ్చేసిన‌ట్లు తెలుస్తుంది. ఈ తీరు చూస్తుంటే మొత్తానికి ఇక ప‌వ‌న్ నుంచి సినిమాలు ఊహించ‌డం క‌ష్ట‌మే.
 

More Related Stories