English   

పవన్ కళ్యాణ్ కావాలనే ఇలా చేస్తున్నాడా..?

Pawan_kalyan

పవన్ కళ్యాణ్ కావాలనే ఇలా చేస్తున్నాడా అని ఎవరికైనా అనిపించకమానదు. ఎందుకంటే ఆయన కొత్త ప్రణాళికలు అలా ఉన్నాయి మరి. మొన్నటికి మొన్న మాస్ మహరాజ్ రవితేజ కొత్త సినిమా నేల టిక్కెట్టు ఆడియో ఫంక్షన్ కు వస్తానని కమిట్ అయ్యాడు. ఇప్పుడు అదే రోజు అల్లు అర్జున్ థ్యాంక్స్ టు ఇండియా మీట్ కూ చీఫ్ గెస్ట్ గా అటెండ్ కాబోతున్నాడు. ఈ రెండు ఫంక్షన్స్ ఈవెనింగ్ టైమ్ లో జరగబోతుండటమే ఇప్పుడు అసలు సమస్యకు కారణం. కానీ అసలు సమస్యే లేదు.. పవన్ కళ్యాణ్ కావాలనే ఇలా చేస్తున్నాడనే టాక్స్ వినిపిస్తున్నాయి. అదేంటీ అంటే దీని వెనక ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ కూడా వినిపిస్తోంది. 

ఒకే రోజు రెండు ఇంపార్టెంట్ ఫంక్షన్స్ అంటెండ్ కావడం అనేది కాస్త కష్టమే. అందునా పవన్ కళ్యాణ్ లాంటి బిగ్గెస్ట్ పొలిటికల్ స్టార్ కు మరీ ప్రాబ్లమ్. అయినా కమిట్ అయ్యాడంటే ఇకపై పవన్ ఈ రెండు విషయాల్లో రెండు విషయాలు వినిపిస్తున్నాయి. ఒకటి నేల టిక్కెట్టు ఆడియో ఫంక్షన్ కు వచ్చేది రవితేజ కోసం కాదు. ఈ చిత్ర నిర్మాత రామ్ తాళ్లూరి కోసం. ఇతను గత కొన్నాళ్లుగా జనసేన కు బ్యాక్ పుష్షర్ గా ఉన్నాడనేది చాలామందికి తెలుసు. జనసేనకు సంబంధించిన పబ్లిక్ మీటింగ్స్ ఆర్గనైజ్ చేయడంలో ఈయన ముందుంటారనే టాకూ ఉంది. అది ఓ కారణమైతే.. త్వరలో ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు తనకు సినిమా వారి సపోర్ట్ కూడా కనీసం ‘ఇన్ డైరెక్ట్’గా అయినా అవసరం. అందువల్ల ఈ నెల 10న జరగబోయే నేల టిక్కెట్టు ఆడియో ఫంక్షన్ కు వస్తానని మాట ఇచ్చాడు. 

ఇక అదే రోజు సాయంత్రం 7గంటలకు జరిగే నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాకు సంబంధించిన థ్యాంక్స్ టు ఇండియా మీట్ కూ వస్తున్నాడు. ఇది తమ ఫ్యామిలీ అంతా ఒకే తాటిపై ఉందని చెప్పడానికే. నిజానికి గత కొన్నాళ్లుగా పవన్ అండ్ బన్నీ మధ్య గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ ను రీసెంట్ గా ఫిల్ చేసుకున్నారు. శ్రీ రెడ్డి పుణ్యమా అని ఈ ఫ్యామిలీ అంతా ఒకేతాటిపైకి( ఎట్ లీస్ట్ ఉన్నారనే విషయం పబ్లిక్ కు తెలిసి) వచ్చింది. అంతేకాక మొన్న ఆడియో ఫంక్షన్ లో పవన్ గురించి బన్నీ కూడా చాలా బాగా చెప్పుకొచ్చాడు. అందువల్ల ఇప్పుడా రిలేషన్ ను కంటిన్యూ చేయక తప్పదు. పైగా ఇప్పడు ఇండస్ట్రీలో ఎవరి ఫ్యామిలీలోని హీరో అయినా మరో ఫ్యామిలీ హీరో ఫంక్షన్ కు అటెండ్ అయితే వీరికి చెడింది అన్న మాటలు చాలా వేగంగా వ్యాపిస్తున్నాయి. వాటిని ఆపాలన్నా పవన్ వెళ్లక తప్పదు. కాకపోతే ఈ వేదికపై పవన్ ఏం మాట్లాడతాడా అనేది ఇంట్రెస్టింగ్ గా మారిందిప్పుడు. 

More Related Stories