English   

నా పేరు సూర్య చూడ‌లేద‌న్న ప‌వ‌న్..

Pawan-Kalyan
2018-05-11 15:59:30

ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటే ఇప్పుడు కాదు.. ఎప్పుడూ బ్రాండే. ఆయ‌న సినిమాలు చేసినా.. చేయ‌క‌పోయినా ఉన్న క్రేజ్ మాత్రం ఎప్పుడూ త‌గ్గ‌దు. ఆయ‌న వేడుక‌ల‌కు వ‌స్తే అదోర‌కం మ‌జా అభిమానుల‌కు. ఇప్పుడు నా పేరు సూర్య థ్యాంక్స్ మీట్ కు కూడా వ‌చ్చాడు ప‌వ‌ర్ స్టార్. సినిమా పెద్ద‌గా ఆడ‌ట్లేదు అయినా కానీ దీనికి ఫంక్ష‌న్ ఏర్పాటు చేసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. వ‌చ్చి ఏం మాట్లాడ‌తాడో అనుకున్న వాళ్ల‌కు త‌న స్పీచ్ తో మంచి షాకే ఇచ్చాడు ప‌వ‌ర్ స్టార్. తాను ఇంకా సినిమా చూడ‌లేద‌ని చెప్పాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్. చూసిన వాళ్లంతా సినిమా బాగుంద‌ని చెబుతున్నార‌ని.. బ‌న్నీ బాగా చేసాడ‌ని మెచ్చుకుంటున్నార‌ని చెప్పాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్. క‌చ్చితంగా తాను జ‌నాల్లోకి వెళ్ల‌బోయే ముందు నా పేరు సూర్య చూస్తాన‌ని.. త‌మ మ‌ధ్య‌ బంధం ఎప్పుడూ ఇలాగే ఉంటుంద‌ని చెప్పాడు ప‌వ‌ర్ స్టార్. ఇక వ‌క్కంతం వంశీ త‌న‌కు ద‌ర్శ‌కుడిగా కంటే ర‌చ‌యిత‌గా ఎక్కువ ప‌రిచ‌యం అని చెప్పాడు ప‌వ‌న్. కొమ‌రం పులి టైమ్ లో తాను ఓ సినిమా చేయాల్సి ఉన్నా మిస్ అయింద‌న్నాడు ప‌వ‌ర్ స్టార్. మొత్తానికి సినిమా ఇంకా చూడ‌లేద‌ని నిజం మాత్రం చెప్పాడు ప‌వ‌ర్ స్టార్. మ‌రి ఈయ‌న‌కు తీరిక ఎప్పుడు దొరుకుతుందో.. ఎప్పటికి చూస్తాడో..? 

More Related Stories