English   

బుల్లితెర మీద ప‌వ‌ర్ స్టార్..

pawan kalyan
2018-07-24 12:15:11

ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాల‌కు దూరం అయ్యాడ‌ని ఫీల్ అవుతున్నారా..? ఇక ఆయ‌న్ని మ‌ళ్లీ సినిమాల్లో చూస్తామో లేదో అనీ బాధ ప‌డుతున్నారా..? అయితే ఈ అవ‌కాశం మీకోస‌మే.. ఏంటి యాడ్ ఇస్తున్నారు అనుకుంటున్నారా..? అవును ఇప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేస్తోన్న ప‌ని చెబితే క‌చ్చితంగా ఇదే అనుకుంటారు. ఈయ‌న త్వ‌ర‌లోనే బుల్లితెర‌పై ద‌ర్శ‌న‌మివ్వబోతున్నారు. అన్నీ కుదిర్తే ఎన్నిక‌ల కంటే ముందే జ‌న‌సేనాని చిన్నితెర‌పై మ‌న ఇంట్లోనే కూర్చుని చూడొచ్చు. ఈయ‌న ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై ప‌రిష్కారం వెతికేలా సామాజిక న్యాయం కోసం ఓ కార్య‌క్ర‌మం చేయ‌బోతున్నాడు. అమీర్ ఖాన్ చేసిన స‌త్య‌మేవ‌జ‌య‌తే త‌ర‌హాలో సాగుతుంది ఈ కార్య‌క్ర‌మం. 

చాలా ఏళ్ల కింద ప‌వ‌న్ క‌ళ్యాణ్ దీని తెలుగు వ‌ర్ష‌న్ చేస్తార‌ని వార్త‌లొచ్చాయి. కానీ అప్పుడు ఆయ‌న ఉన్న బిజీకి కుద‌ర్లేదు. అయితే ఇప్పుడు రాజ‌కీయాల్లో కూడా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్.. ఇలాంటి కార్య‌క్ర‌మం చేయ‌డం వ‌ల్ల త‌న పార్టీ ఇమేజ్ తో పాటు త‌న ఇమేజ్ కూడా పెరుగుతుంద‌ని భావిస్తున్నాడు. పైగా ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను కూడా బ‌య‌టికి చూపించి దాని ప‌రిష్కారం కోసం కావాల్సిన సాయం చేయడానికి ఈ కార్య‌క్ర‌మం సాయ‌ప‌డుతుంద‌ని భావిస్తున్నాడు ప‌వ‌ర్ స్టార్. ఇది 99 టివిలో ప్ర‌సారం కానున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. దానికి కూడా కార‌ణం లేక‌పోలేదు.. 99 టివిని ఇప్ప‌టికే ప‌వ‌న్ స‌న్నిహితులు తోట చంద్ర‌శేఖ‌ర్ తీసుకున్నారు. అందుకే ఈ టీవీలో ప‌వ‌న్ త‌న షో నిర్వ‌హించ‌బోతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వ‌ర‌లోనే బ‌య‌టికి రానున్నాయి. 

More Related Stories