English   

జనసేనకు పవన్ కళ్యాణ్ మాత్రమే.. మెగాసేన తోడు లేదు..

pawan kalyan only for janasena
2019-03-18 15:19:50

పవన్ కళ్యాణ్ జనసేన పెట్టిన రోజు నుంచి ఇప్పటి వరకు మెగా అభిమానుల్లో ఒకటే అనుమానం ఉంది. ఎన్నికల సమయంలో ప్రచారం చేయడానికి మెగా కుటుంబం నుంచి ఎవరైనా వస్తారా రారా.. ఒకవేళ వస్తే పవన్ కళ్యాణ్ వాళ్ళను ఆహ్వానిస్తాడా లేదా.. అసలు తన పార్టీలో కుటుంబ సభ్యులను చేర్చుకోవడానికి పవన్ కళ్యాణ్ ఇష్టపడుతున్నాడా లేదా.. ఇలా చాలా అనుమానాలు అభిమానులతో పాటు సామాన్య ప్రజల్లో కూడా ఉన్నాయి. అయితే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన మొదటి రోజు నుంచి ఇప్పటివరకు తాను ఒక్కడే కష్టపడుతున్నాడు.. కానీ  ఏ ఒక్క రోజు కూడా తన కుటుంబ సభ్యులను ఆహ్వానించలేదు. రామ్ చరణ్, అల్లు అర్జున్, నాగబాబు లాంటి వాళ్లు ఎంతమంది ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పినా కూడా ఇప్పటివరకు ఏ ఒక్కరిని కూడా ఆహ్వానించలేదు పవన్ కళ్యాణ్. పైగా వాళ్ళంతా బిజీగా ఉంటారు.. పార్టీ కోసం వాళ్ళను పిలవడం తనకు ఇష్టం లేదని నేరుగానే చెప్పేశాడు పవర్ స్టార్. ఇక ఇప్పుడు కూడా ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో జనసేన కోసం ఎవరూ రారని క్లారిటీ ఇచ్చేశాడు పవన్ కళ్యాణ్. వామపక్షాలు, బీఎస్పీతో కలిసి రాబోయే ఎన్నికల్లో పోటీకి దిగుతున్నాడు పవర్ స్టార్. వాళ్ళకు 7 ఎంపి సీట్లు.. 35 అసెంబ్లీ సీట్లు ఇచ్చాడు జనసేనాని.

అంటే రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ నికరంగా 140 శాసనసభ సీట్లు, 18 ఎంపీ సీట్లలో పోటీ చేస్తుందన్నమాట. ఇప్పటివరకూ 64 సీట్లలో అభ్యర్థులను ప్రకటించారు పవన్ కళ్యాణ్. మొత్తం అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల ప్రచారం మొదలు పెట్టబోతున్నారు. ఈ ప్రచారంలో మెగా కుటుంబం నుంచి ఏ ఒక్కరు కూడా ప్రత్యక్షంగా బయటికి రారు. అయితే పవన్ కళ్యాణ్ వద్దు అన్నంత మాత్రాన మెగా కుటుంబం ఖాళీగా కూర్చున్నట్టు కనిపించడం లేదు. ఓ వైపు రామ్ చరణ్ బయట ఎక్కడికి వెళ్లినా కూడా బాబాయ్ పవన్ కళ్యాణ్ కు తోడుగా నిలుస్తున్నారు. ఇక నాగబాబు యూట్యూబ్ ఛానల్ పెట్టి తమ్ముడు పవన్ కళ్యాణ్ కోసం రోజుకు ఒక వీడియో విడుదల చేస్తున్నాడు. ప్రతిపక్షాలను ఎండగడుతున్నారు. ఇలా ఎవరికి తోచిన ప్రచారం వాళ్లు సోషల్ మీడియాలో చేస్తున్నారు.. కానీ ప్రత్యక్షంగా మాత్రం బయటికి వచ్చి పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ చేసే అవకాశం మాత్రం లేదు. ఏం చేసినా.. ఎంత కష్టపడినా తాను ఒక్కడినే చేస్తాను అంటున్నాడు పవన్ కళ్యాణ్. పదేళ్ల కింద ప్రజారాజ్యం పార్టీ సమయంలో మెగా కుటుంబం ప్రచారం చేస్తే ఏం జరిగిందో అందరికీ తెలుసు. అందుకే ఈ సారి ఇ ఎవరిని దగ్గరికి కూడా రానివ్వడం లేదు పవన్ కళ్యాణ్. మరి ఎన్నికల్లో పవర్ స్టార్ ఎలాంటి మార్పు తీసుకు వస్తాడో చూడాలి.

More Related Stories