English   

మొదలైన పవన్ రానాల సినిమా షూటింగ్

Pawan Kalyan Rana
2021-01-25 16:48:22

టాలీవుడ్ అగ్రనటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రాణాదగ్గుబాటి ల కాంబినేషన్ లో మలయాళ సినిమా "అయ్యప్పనుమ్ కోషియమ్" రీమేక్ ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ  సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నం:12 గా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ నేడు ప్రారంభం అయింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ షూటింగ్ లో పాల్గొనగా యాక్షన్ సన్ని వేశాలకు శ్రీకారం చుట్టారు. ఈ సినిమాకు చిత్ర దర్శకుడు సాగర్.కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే- సంభాషణలు సుప్రసిద్ధ దర్శకుడు, రచయిత ‘త్రివిక్రమ్‘ అందిస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ పదిరోజులపాటు హైదరాబాద్ లో జరుగుతుందని నిర్మాత పేర్కొన్నారు. హైదరాబాద్ లో రానా, పవన్ కళ్యాణ్ ల మధ్యజరిగే సన్నివేశాలను చిత్రించనున్నారు. చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ...తమ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించనుందని తెలిపారు. సినిమాలో ప్రముఖ నటులు సముద్ర ఖని, మురళీశర్మ, బ్రహ్మాజీ, నర్రా శ్రీను లు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు ఎస్ ఎస్ తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. మరోవైపు సినిమాకు "బిల్లా రంగా" అనే టైటిల్ పరిశీలనలో ఉంది. 

More Related Stories