English   

పవన్ కళ్యాణ్.. పర్ఫెక్ట్ ప్లాన్

Pawan-Kalyan-rangasthalam
2018-04-13 08:07:40

పవన్ కళ్యాణ్ పర్ఫెక్ట్ చాయిస్ తీసుకున్నాడు. తనపై వస్తోన్న విమర్శలకు కరెక్ట్ ఆన్సర్ ఇవ్వడానికి సరైన వేదిక ఎంచుకున్నాడు. ఫ్యామిలీ గురించి చేస్తోన్న కమెంట్స్ కు కౌంటర్ ఇవ్వడానికి ఫ్యామిలీ వేడుకనే ఎంచుకుని  పర్ఫెక్ట్ ఛాయిస్ అనిపించాడు. ఇంతకీ విషయం ఏంటంటే.. లేటెస్ట్ గా రోరింగ్ హిట్ మూవీ రంగస్థలం సక్సస్ మీట్ ను కూడా భారీగా నిర్వహించబోతున్నారు. రేపు సాయంత్రం(13.04) హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్ లో ఈ ఫంక్షన్ గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు. ఈ వేడుకకు చీఫ్ గెస్ట్ గా పవన్ కళ్యాణ్ రాబోతున్నాడు. ఇదే మెగా ఫ్యాన్స్ కు అసలైన మజా ఇవ్వబోతోన్న విషయం. 

రామ్ చరణ్ కెరీర్ లోనే ది బెస్ట్ మూవీగా రంగస్థలంనే చెబుతున్నారు. రివ్యూస్ నుంచి కలెక్షన్స్ వరకూ రంగస్థలం గురించి ఏ నెగెటివ్ టాకూ వినిపించలేదింత వరకూ. యూనానిమస్ హిట్ గా ఎంటైర్ ఆడియన్స్ నుంచి సర్టిఫికెట్ అందుకున్న రంగస్థలం సక్సస్ ను కూడా మెమరబుల్ గా మలచుకోవాలని టీమ్ ప్లాన్ చేసింది. ఇందుకోసం పవన్ కళ్యాణ్ ను చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించారు. అందుకే ఆయన కూడా రీసెంట్ గా సినిమా చూసి సూపర్బ్ అనేశాడు. అదే రోజు ఈ సినిమా సక్సెస్ మీట్ కు వస్తున్నట్టు.. సినిమా గురించి ఆ రోజే మాట్లాడతానని కూడా చెప్పాడు.

అయితే ఇన్నాళ్లూ పవన్ కళ్యాణ్ మెగా ఫ్యామిలీతో విడిపోయాడు. అతను వారి సినిమా ఫంక్షన్స్ కు వెళ్లడు కానీ, ఇతరుల సినిమాలకోసం టైమ్ ఇస్తాడు అనే విమర్శలు వచ్చేవి. కానీ సరైన టైమ్ చూసుకుని ఆ విమర్శలకు ఆన్సర్ చెప్పబోతున్నాడు పవన్. అంటే విమర్శకులకు సమాధానం చెప్పాల్సిన పనిలేదు. కానీ వారి నోరు మూయించడానికి ఇంతకంటే మంచి టైమ్ ఏముంటుంది. అందుకే పర్ఫెక్ట్ టైమింగ్ లో పర్ఫెక్ట్ ప్లానింగ్ తో రంగస్థలం మూవీ సక్సెస్ మీట్ కు రాబోతున్నాడు. ఈ సందర్భంగా మెగా ఫ్యాన్స్ కానీ, విమర్శకులు కానీ, మొన్న భరత్ అనేనేను ఆడియో ఫంక్షన్ లో ‘‘ మేం మేం బానే ఉంటాం.. కానీ మీరే’’.. అంటూ మహేష్ బాబు చెప్పిన మాట గుర్తుతెచ్చుకోవాలి.. 

More Related Stories