English   

మెగా వారసుడెవరో తేల్చిన పవన్ కళ్యాణ్

pawan-charan
2018-04-14 18:55:04

మెగాస్టార్ చిరంజీవికి సరైన వారసుడు ఎవరు..? సిల్లీ క్వశ్చన్.. రామ్ చరణే కదా.. అనుకుంటున్నారేమో. అది నిజమే. కానీ మధ్యలో కొందరు వచ్చారు. మెగా స్టార్ రేంజ్ ఉన్న హీరోలు మేమే అని అనలేదు కానీ.. అన్నంత పని చేస్తున్నారు.. ఇది మెగా ఫ్యామిలీ కొంతకాలంగా ఫీలవుతోన్న మేటర్. ఆ ఫీలింగ్ కు ఫుల్ స్టాప్ పెట్టడానికే పవన్ కళ్యాణ్ నిన్న రంగస్థలం సక్సెస్ మీట్ కు వచ్చాడు. రావడమే కాదు.. ఈ మధ్య కాలంలో ఏ సినిమా ఫంక్షన్ లో కనిపించనంత ఉత్సాహంగా ఉన్నాడు. దీనికంతటికీ కారణం.. రామ్ చరణే తమ ఫ్యామిలీకి సరైన వారసుడు అని డిక్లేర్ చేయడానికే అంటున్నారు చాలామంది. దీనికి కారణం.. అల్లు అర్జున్ అని కూడా అంటున్నారు. 

గత కొన్నాళ్లుగా రామ్ చరణ్ కు సరైన హిట్ లేదు. అప్పుడెప్పుడో 50కోట్ల క్లబ్ తో హల్ చల్ చేశాడు. కానీ తర్వాత ఇతర హీరోలు దూసుకుపోయినా.. తను మాత్రం రొటీన్ సినిమాలతో ఆగిపోయాడు. ఈ గ్యాప్ లో అల్లు అర్జున్ వరుసగా బ్లాక్ బస్టర్లు కొట్టాడు. దీంతో చాలామంది మెగాస్టార్ చిరంజీవి సినిమా వారసుడు బన్నీనే కావొచ్చు అనే అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అటు బన్నీ కూడా మెగా ఫ్యామిలీలో ఇంపార్టెంట్ మెంబర్ అయిన పవన్ కళ్యాణ్ ను కాస్త తక్కువ చేసి చూడ్డం మొదలుపెట్టాడు. చిరంజీవి మాత్రమే మాకు ఆదర్శం అన్నట్టుగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఈ విషయంలో మెగా వర్సెస్ అల్లు అనే వార్ కూడా కొన్నాళ్లు నడిచింది. అభిమానుల్లో మరీ ముఖ్యంగా ఉందా గొడవ. అయితే ఇప్పుడు రామ్ చరణ్ అనూహ్యంగా అన్ని రికార్డులూ బద్ధలు కొట్టేస్తున్నాడు. ఏకంగా తండ్రినే దాటేయబోతున్నాడు. అంటే లేట్ అయినా లేటెస్ట్ గా ఎప్పటికీ తనే మెగాస్టార్ కు అన్ని విధాలుగా వారసుడు అని ప్రూవ్ చేసుకున్నాడు. అది నిజమే.. తమ తర్వాత చరణ్ తప్ప ఇంకెవరూ మెగా హీరోల్లో తోపులు లేరు అని ఇన్ డైరెక్ట్ గా వార్న్ చేయడానికే పవన్ ఈ ఫంక్షన్ కు హాజరైనట్టు విశ్లేషకు భావిస్తున్నారు. 

ఇక ఇప్పటి వరకూ మెగా ఫ్యామిలీ ఫంక్షన్స్ కు దూరంగా ఉన్న పవన్ సడెన్ గా రావడం వెనక చాలా కాలిక్యులేషన్సే ఉన్నాయనేది కొందరి వెర్షన్. అది నిజమే అన్నట్టుగా ఈ ఫంక్షన్ లో అల్లు అరవింద్ కూడా కనిపించలేదు. మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఏ ఫంక్షన్ కైనా ఆయన ఖచ్చితంగా హాజరవుతాడు. కానీ ఈ సారి రాలేదు. కారణం.. పవన్ వస్తున్నాడనే.. లేదా అతనొస్తే పవన్ నేను రాను అని ఉంటాడు అని చాలామంది అనుకుంటున్నారు. ఏదేమైనా పవన్ రంగస్థలం సక్సెస్ మీట్ కు రావడం వెనక చాలా లెక్కలే ఉన్నాయని.. అవి అర్థం కావాల్సిన వారికి క్లియర్ గా అర్థం అయ్యాయని చాలామంది చెప్పుకుంటున్నారు. సో.. ఒక్క ఫంక్షన్ తో పవన్ కళ్యాణ్ చాలా లెక్కలు క్లియర్ సెట్ చేశాడన్నమాట.

More Related Stories