English   

ప‌వ‌న్ మ‌ళ్లీ సినిమాల్లోకి..? 

pawan kalyan - 01

ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌ళ్లీ సినిమాల్లోకి వ‌స్తున్నాడా..? ఈయ‌న ఇంకో సినిమా చేయ‌బోతున్నాడా..? ఎన్నిక‌ల‌కు ముందే మ‌రో సినిమా చేస్తాడా.. అయిన త‌ర్వాత అన్నీ ప్ర‌శాంతంగా ఉన్న టైమ్ లో చేస్తాడా..? ఇప్పుడు ఇలాంటి ప్ర‌శ్న‌లెందుకు వ‌స్తున్నాయ్ అనుకుంటున్నారా.. ? ఈ మ‌ధ్యే త్రివిక్ర‌మ్ తో క‌లిసి మాట్లాడిన‌పుడు ఫ్యూచ‌ర్ ప్రాజెక్టుల‌పై కూడా ప‌వ‌న్ చ‌ర్చించాడ‌ని తెలుస్తుంది. ర‌వీంద్ర భార‌తిలో త్రివిక్ర‌మ్ స‌తీమ‌ణి సౌజ‌న్య భ‌ర‌త‌నాట్య ప్ర‌ద‌ర్శ‌న‌కు స‌తీస‌మేతంగా వ‌చ్చాడు ప‌వ‌ర్ స్టార్. అక్క‌డే పాత స్నేహితుడితో చాలా సేపు ముచ్చ‌టించాడు. 

ఈ ఇద్ద‌రూ ప‌బ్లిక్ ప్లేస్ లో క‌ల‌వక దాదాపు ఆర్నెళ్లు దాటేసింది. అజ్ఞాత‌వాసి త‌ర్వాత ఎవ‌రి దారి వాళ్ల‌దే అన్న‌ట్లున్నారు ఇద్ద‌రూ. పైగా ఇద్ద‌రి మ‌ధ్య అభిప్రాయ బేధాలు వ‌చ్చాయంటూ వార్త‌లొచ్చాయి. కానీ తాము ఇప్ప‌టికీ ఎప్ప‌టికీ మంచి స్నేహితుల‌మే అని నిరూపించుకున్నారు ప‌వ‌న్, త్రివిక్ర‌మ్. ఇదిలా ఉంటే 2020లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌ళ్లీ త్రివిక్ర‌మ్ తోనే రీ ఎంట్రీ ఇవ్వ‌బోతున్నార‌ని తెలుస్తుంది. అప్ప‌టి వ‌ర‌కు రాజ‌కీయాల్లో ఉన్న ప‌రిస్థితుల‌ను బ‌ట్టి ప‌వ‌న్ సినిమా చేయ‌బోతున్నాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. ఇప్ప‌టికైతే ఇంకా ప‌వ‌న్ తో కొంద‌రు నిర్మాత‌లు సినిమాలు క‌మిటై ఉన్నారు. వాళ్ల‌కు ప‌వ‌న్ కూడా వీలు చిక్కిన‌పుడు సినిమా చేస్తాన‌ని చెప్పాడు కూడా. మ‌రి చూడాలిక‌.. ఏం జ‌ర‌గ‌బోతుందో..?

More Related Stories