రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై ఇలా స్పందించిన జనసేనాని

వ్యవసాయం లాభసాటి కావాలన్నదే జనసేన ఆలోచన అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. పవన్ మాట్లాడుతూ...తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులను ఏపీ ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నష్టపోయిన రైతులకు ఎకరానికి 35 నష్ట పరిహారం అందజేయాలని అన్నారు. పరిహారం ఆలస్యం కవడంతోనే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని..ఇప్పటివరకు నాలుగు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు.
పంట నష్టం పై అన్ని ప్రాంతాల్లో తమ పార్టీ నేతలు పర్యటించి నివేదిక రూపొందిస్తామని దాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అందిస్తామని చెప్పారు. ఎప్పుడో రైతులకు కొద్ధో గొప్పో నష్టపరిహారం అందుతుందని, కౌలు రైతులకు కూడా పంట నష్టం అందాలని దానికోసం భవన నిర్మాణ కార్మికుల కోసం పోరాడినట్టు పోరాడుతామని అన్నారు. రైతుల కోసం జైకిసాన్ కార్యక్రమాన్ని త్వరలోనే మొదలు పెడతామన్నారు. 5 లేదా 10వేలు ఇస్తే రైతులకు న్యాయం జరగదని అన్నారు. రజినీ పొలిటికల్ ఎంట్రీపై వీలేకర్ లు పవన్ స్పందన అడగ్గా...భారీగా అభిమాన బలం, బలమైన ఆలోచన ఉన్నవాళ్లు రాజకీయాల్లోకి వస్తే మంచి జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.