English   

ఈ సినిమా కొణిదెలను వెతుక్కుంటూ వచ్చింది !

pk
2019-08-23 19:15:21

మెగా అభిమానులు పండుగలా ఫీల్ అయ్యే రోజు ఈ రోజు. నేరడు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు కావడంతో ఒకరోజు ముందుగానే హైదరాబాద్‌లో సంబరాలు మొదలయ్యాయి. మెగాస్టార్ 64వ పుట్టినరోజు వేడుకలు నిన్న హైదరాబాద్‌‌లోని శిల్పకళా వేదికలో ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఈ వేడుకలకు పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్టుగా రాగా, ఈ వేడుకల్లో మెగా హీరోలలో అందుబాటులో ఉన్నవారు అందరూ పాల్గొన్నారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉయ్యలవాడ నరసింహారెడ్డి సినిమాలో తాను నటించకపోయినా సినిమా కోసం గొంతు ఇవ్వడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. మొట్టమొదటి స్వతంత్ర యోధుడయిన నరసింహారెడ్డిని చరిత్ర మరిచినా రేనాల, కర్నూలు, కొణిదెల మరువలేదని అన్నారు. కొణెదల అనే ఇంటి పేరు ఎక్కడ నుండి వచ్చిందో తెలియదని, నేను ఎప్పుడూ అందరినీ అడిగేవాడిని పవన్ అన్నారు.

అయితే కర్నూల్ జిల్లా నందికొట్కూరులో కొణెదల గ్రామం ఉంది.  ఉయ్యాల వాడ నరసింహారెడ్డి కూడా కర్నూల్ ప్రాంత వాసి అని అన్నారు. ఈ సినిమా అన్నయ్యను వెతుక్కుంటూ వచ్చిన సినిమా అని, అన్నయ్య చేస్తేనే న్యాయం జరుగుతుందని ఈ సినిమా మెగాస్టార్ దాకా వచ్చిందని పవన్ పేర్కొన్నారు. అందుకే నిర్మాతను కూడా బయటి వారిని పెట్టుకోలేదని, కొణెదెల ఇంటిపేరున్న రామ్ చరణ్ ఈ సినిమాని నిర్మిస్తున్నారని అన్నారు. ఒక తమ్ముడిగా నేను చేయలేని పనిని తమ్ముడు లాంటి చరణ్ చేశారని అన్నారు. ఎవరైనా తండ్రి కొడుకుని లాంఛ్ చేస్తాడు, కానీ 150 సినిమాతో తండ్రిని కొడుకు రీ లాంఛ్ చేశాడని, ఇప్పుడు ప్రపంచ మొత్తం చెప్పుకునేలా చరిత్ర మరిచిన వీరుడు నరసింహారెడ్డి జీవిత చరిత్రను రామ్ చరణ్ తెరపై ఆవిష్కరిస్తున్నాడని అన్నారు. సింహం గురించి వేటగాడు చెప్పడం కాదు, సింహమే బయటకు వచ్చి తనను గురించి తను చెప్తే కథ వేరేలా ఉంటుంది. అలాంటి సింహం కధే ఈ ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి అని పవన్ పేర్కొన్నారు. 

More Related Stories