English   

మీడియాకు దొరికిపోయిన ప‌వ‌న్ క‌ళ్యాణ్.. 

Pawan-Kalyan-99tv
2018-08-06 18:06:30

రాజ‌కీయాల్లో ఉన్న‌పుడు అంద‌రి కళ్లు మ‌న‌మీదే ఉంటాయి. ఏం చేసినా.. ఎక్క‌డికి వెళ్లినా కూడా ఒక‌టికి ప‌దిసార్లు చూసుకోవాలి. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు ఈ విష‌యం తెలియంది కాదు. ఇప్ప‌టి వ‌ర‌కు త‌న వైపు ఏ త‌ప్పు లేకుండా ఇన్నాళ్లూ జాగ్ర‌త్త ప‌డుతూనే వ‌చ్చాడు ప‌వ‌ర్ స్టార్. కానీ ఈయ‌న కూడా మామూలు మ‌నిషే క‌దా.. ఎక్క‌డో ఓ చోట త‌ప్పు చేస్తాడు క‌దా..! ఇన్నాళ్ల‌కు ప‌వ‌న్ లో ఆ త‌ప్పు దొర్లింది. కావాల‌ని చేసింది కాక‌పోయినా మీడియా ముందే క‌మిట్ అయిపోయాడు ప‌వ‌ర్ స్టార్. ఈయ‌నకు ప్ర‌త్యేకంగా ఓ చానెల్ ఉందంటూ చాలా రోజుల నుంచి ప్ర‌చారం జ‌రుగుతూనే ఉంది. 99 టివిని జ‌న‌సేన కార్య‌వ‌ర్గ అధ్య‌క్షుడు తోట చంద్ర‌శేఖ‌ర్ తీసుకున్నాడు. 

అంటే ఈ ఛానెల్ ప‌వ‌న్ ది అనే లెక్క‌. దీనికి ఇప్పుడు మీడియా ముందే సాక్ష్యం ఇచ్చాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్. తాజాగా జ‌రిగిన ఓ ప్రెస్ మీట్ లో 99 లోగోను ముందు పెట్టి.. మిగిలిన కెమెరాల‌ను వెన‌క్కి జ‌ర‌పాలంటూ ప‌వ‌న్ చేసిన క‌మెంట్స్ హాట్ గా మారిపోయాయి. ఓ ప్రెస్ మీట్ కు వ‌చ్చిన‌పుడు అన్ని ఛానెల్స్ స‌మాన‌మే. ప‌వ‌న్ లాంటి వాళ్లు కూడా ఇలా మీడియాను స‌పేరేట్ చేసి.. త‌న ఛానెల్ ను హైలైట్ చేసుకోవ‌డం ఏంటి అని కొంద‌రు బ‌హిరంగంగానే కామెంట్ చేస్తున్నారు. ఈయ‌న తీరు చూస్తుంటే ఇప్ప‌ట్నుంచీ జ‌న‌సేన ప్ర‌తీ ఈవెంట్ ను 99 టీవీ ద‌త్త‌త తీస‌కునేలా క‌నిపిస్తుంది. మ‌రి దీనిపై ప‌వ‌న్ ఏం అంటాడో చూడాలిక‌..!

More Related Stories