English   

ఆ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి పవన్

pk
2019-11-12 19:06:14

అసలు ఏమాత్రం అంచానాలు లేని ఆ సినిమా కేవలం ట్రైలర్ తోనే అంచనాలు పెంచిన జార్జ్ రెడ్డి సినిమా రిలీజ్ కు రెడీ అయింది. ఇప్పటికే బిజినెస్ పూర్తి చేసుకున్న ఈ మూవీ నవంబర్ 22న విడుదల కానుంది. అయితే సినిమాకు సంబందించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ముఖ్య అతిధిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాబోతున్నట్లు తెలుస్తోంది. విద్యార్థి పోరాటాల ఆలవాలం అయిన ఉస్మానియా యూనివర్శిటీలో 1965 నుంచి 1975 మ‌ధ్య ఎన్నో ఉద్యమాలకి ఊపిరి పోసిన జార్జ్ రెడ్డి చాలా చిన్న వయసులో కొందరు ప్రత్యర్థుల చేతిలో క్యాంపస్‌లోనే హత్యకు గురయ్యాడు. ఇప్పుడు ఆయ‌న జీవిత నేప‌థ్యంలో జార్జ్ రెడ్డి పేరుతో చిత్రం రూపొందుతుంది. 'దళం' అనే సినిమాను తెరకెక్కించిన జీవన్ రెడ్డి 'జార్జ్ రెడ్డి' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మైక్ మూవీస్, 3 లైన్స్ మూవీస్, సిల్లీ మంక్స్ స్టూడియోపై అప్పిరెడ్డి, దాము రెడ్డి, సుధాకర్ యక్కంటి నిర్మిస్తున్న ఈ సినిమాలో 'వంగవీటి' ఫేం సందీప్‌ మాధవ్‌ (సాండి) ఈ సినిమాలో లీడ్‌ రోల్‌ పోషిస్తున్నారు. మనోజ్‌ నందన్‌, చైతన్య కృష్ణ, శత్రు, వినయ్ వర్మ, తిరువీర్‌, అభయ్ బేతిగంటి, ముస్కాన్‌ లు నటిస్తున్న ఈ సినిమాలో హీరో సత్య దేవ్‌ కూడా ఈ సినిమాలో గెస్ట్‌ రోల్‌ ఫ్లే చేస్తున్నారు. మరాఠీ నటి దేవిక 'జార్జి రెడ్డి' తల్లి పాత్రలో కనిపించబోతుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్ బాద్యతలు నేత్తికేట్టుక్కున్న నాగబాబు తన చానల్ ద్వారా ప్రమోట్ చేస్తున్నారు.

More Related Stories