English   

రవితేజ కోసం ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌స్తున్నాడు

Pawan-Kalyan
2018-05-04 18:19:13

ర‌వితేజ కోసం ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌స్తున్నాడు. విన‌డానికి, న‌మ్మ‌డానికి కాస్త తేడాగా ఉన్నా ఇది నిజం. ఇప్ప‌టి వ‌ర‌కు ర‌వితేజ‌కు సంబందించిన సినిమా ఫంక్ష‌న్స్ లో ప‌వ‌ర్ స్టార్ రాలేదు. బ‌ట్ ఫ‌ర్ ద ఫ‌స్ట్ టైమ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ర‌వితేజ సినిమా ఆడియో ఫంక్ష‌న్ కు చీఫ్ గెస్ట్ గా వ‌స్తున్నాడు. మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ లేటెస్ట్ మూవీ నేల టిక్కెట్టు. మాళ‌విక శ‌ర్మ హీరోయిన్ గా న‌టిస్తోన్న ఈ మూవీకి క‌ళ్యాణ్ కృష్ణ కుర‌సాల ద‌ర్శ‌కుడు. రామ్ తాళ్లూరి నిర్మిస్తోన్న ఈ మూవీకి ఆడియో డేట్ క‌న్ఫార్మ్ అయింది. ఇక్క‌డ స‌ర్ ప్రైజింగ్ న్యూస్ ఏంటంటే.. ఈ ఆడియోకు చీఫ్ గెస్ట్ గా ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌స్తున్నాడు. ర‌వితేజ సినిమాకు సంబంధించిన ఈవెంట్ లో ప‌వ‌న్ అటెండ్ కావ‌డం ఇదే ఫ‌స్ట్ టైమ్ కావ‌డం విశేషం. కంప్లీట్ మాస్ ఎంట‌ర్టైన‌ర్ గా వ‌స్తోన్న నేల టిక్కెట్టు ఆడియో ఈ నెనల 10న విడుద‌ల కాబోతోంది. నిజానికి 12న అంటూ గ‌త రెండు రోజులుగా సోష‌ల్ మీడియాలో హ‌డావిడీ న‌డించింది. అవ‌న్నీ నిజం కాద‌నీ.. అస‌లు డేట్ తామే చెబుతామ‌ని నిర్మాణ సంస్థ ప్ర‌క‌టించింది. చెప్పిన‌ట్టుగానే ప‌వ‌న్ క‌ళ్యాణ్ చీఫ్ గెస్ట్ అనే స‌ర్ ప్రైజింగ్ న్యూస్ కూడా యాడ్ చేసుకుని మరీ ఈ నెల 10నే పాట‌ల వేడుక అని చెప్పేశారు. ర‌వితేజ గ‌త సినిమాలు నిరాశ‌ప‌రిచాయి. రాజా ది గ్రేట్ త‌ప్ప‌.. చాలా వ‌ర‌కూ ఫ్లాపులే ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో సోగ్గాడే చిన్ని నాయ‌నా, రారండోయ్ వేడుక చూద్దాం వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న క‌ళ్యాణ్ క‌థ చెప్పగానే క‌మిట్ అయ్యాడు. చాలా వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోన్న ఈ మూవీ వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో న‌డిచే యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్. జ‌గ‌ప‌తి బాబు మ‌రో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు. మొత్తంగా ఈ మూవీ పై ర‌వితేజ చాలా ఆశ‌లే పెట్టుకున్నాడు. ఈ నెల 25న సినిమా విడుద‌ల కాబోతోంది. కానీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ చీఫ్ గెస్ట్ అన్న త‌ర్వాత సినిమాపై అంచ‌నాలు పెరుగుతాయి. మ‌రి ఆ అంచ‌నాల్ని మాస్ రాజా నిల‌బెట్టుకుంటాడా లేదా అనేది చూడాలి.

More Related Stories