English   

వకీల్ సాబ్ వచ్చేది అప్పుడేనట 

 pawan kalyan
2020-07-04 07:30:58

అసలు సినిమాలే చేయనని చాలా సార్లు చెప్పిన పవన్ ఇప్పుడు ఏకంగా వరుసగా మూడు నాలుగు సినిమాలు ఒప్పుకుని తన అభిమానులకే కాక సినీప్రియులకు కూడా షాకిచ్చారు. ఆయన రీఎంట్రీ చిత్రం ‘పింక్‌’ రీమేక్‌ ఇప్పటికే సగానికి పైగా చిత్రీకరణ పూర్తి చేసుకోగా వేసవి కానుకగా మే 15న విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. అయితే కరోనా దెబ్బకు ఆ ప్లాన్ అంతా అప్సెట్ అయింది. దాడాపుగా షూట్ చివరి దశకు చేరుకున్న సినిమాని విడుదల వాయిదా వేయక తప్పని పరిస్థితి. అయితే క‌రోనా కార‌ణంగా ‘వ‌కీల్ సాబ్‌’ ముందు అనుకున్నట్టు మే 15న‌ కాకుండా.. ఆగ‌స్టు 14న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని ద‌ర్శక‌ నిర్మాత‌లు భావిస్తున్నట్టు ఆ మధ్య వార్తలు వచ్చాయి. నిజానికి ఇదే తేదీకి మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ విడుద‌ల కావ‌ల‌సి ఉండగా అసలు ఆ సినిమా షూట్ కూడా సగం పైగా పెండింగ్ ఉంది. ఈ నేప‌థ్యంలోనే వ‌కీల్ సాబ్ రిలీజ్ ఆగ‌స్టు 14కి ఫిక్స్ అయింద‌ని అన్నారు. 

కానీ అదీ ఇప్పుడు కుదిరేలా లేదు. ఎందుకంటే ఇప్పటికే షూట్లకి పర్మిషన్ ఇచ్చినా ఎవరూ ధైర్యంగా వెళ్లి షూట్ లో పాల్గొనని పరిస్థితి. ఏదో తెగించి సీరియల్స్ వాళ్ళు ప్రయత్నాలు చేసినా ఒకరి వెంట ఒకరికి కరోనా షాక్ ఇవ్వడంతో ఇప్పుడు సినిమా వాళ్ళు షూట్ లకి వెళ్ళలేని పరిస్థితి. ఈ క్రమంలో వకీల్ సాబ్ ను సంక్రాంతికి రిలీజ్ చేసే యోచన చేస్తున్నట్టు చెబుతున్నారు. ఇప్పటికే సంక్రాంతి రేసులో ఉన్న జక్కన భారీ బడ్జెట్‌ చిత్రం ‘ఆర్‌.ఆర్.‌ఆర్’‌తో పాటు చిరంజీవి నటిస్తోన్న ‘ఆచార్య’ మహేష్‌బాబు నటించనున్న ‘సర్కారు వారి పాట’, అల్లు అర్జున్‌ నటిస్తోన్న ‘పుష్ప’ లాంటి చిత్రాలు సంక్రాంతికి వచ్చే సూచనలు లేవు. అందుకే ‘వకీల్‌ సాబ్’‌ సంక్రాంతికి దించేందుకు దిల్ రాజు ప్లాన్ చేస్తున్నట్టు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పవన్ రీఎంట్రీ సినిమాని ఎప్పుడెప్పుడూ చూద్దామా అని ఆశగా ఎదురుచూస్తున్న అభిమానులకు మాత్రం ఇది బాగా నిరాశ పరిచే వార్త అనే చెప్పాలి. ఇక దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాని బోని కపూర్ సమర్పిస్తున్నారు.  

More Related Stories