English   

పవన్ ఫ్యాన్స్ కి రెడీ అవుతోన్న గిఫ్ట్

Pawan Kalyan Vakeel Saab
2020-08-13 09:18:00

రీ ఎంట్రీ తరువాత పవన్ చేస్తోన్న సినిమా వకీల్ సాబ్. పింక్‌ అనే బాలీవుడ్ సినిమాకి రీమేక్‌ అయిన ఈ సినిమా ఇప్పటికే సగానికి పైగా చిత్రీకరణ పూర్తి చేసుకోగా వేసవి కానుకగా మే 15న విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. అయితే కరోనా దెబ్బకు ఆ ప్లాన్ అంతా పాడయింది కూడా అది వేరే విషయం. ఈ సినిమాలో అంజలి, నివేత థామస్, మల్లేశం హీరోయిన్ అనన్యలు నటిస్తున్నారు. అయితే వకీల్ సాబ్ సినిమా ఫ్లాష్ బ్యాక్ స్టోరీ లో పవన్ కళ్యాణ్ భార్య పాత్రకి శృతి హాసన్ అని ప్రచారం జరిగింది.  అయితే ఆ విషయం మీద శ్రుతి క్లారిటీ ఇచ్చేసింది. ఆమె నటించడం లేదని. అయితే పవన్ భార్యగా ఇలియానాను ఎంపిక చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసినట్టుగా ప్రచారం అయింది.  

ఆ తర్వాత ఈ పాత్ర కోసం మిల్కీ బ్యూటీ తమన్నా పేరు ప్రముఖంగా తెరపైకి వచ్చింది. అయితే ఆ విషయాలు ఎలా ఉన్నా, “వకీల్ సాబ్” నుంచి ఒక్క అప్డేట్ అయినా వస్తే బాగుండునని పవన్ ఫ్యాన్స్ కోరుతున్నారు. సెప్టెంబర్ 2న పవన్ పుట్టినరోజు ఉండడంతో వకీల్ సాబ్ టీజర్ ను విడుదల చెయ్యాలని వకీల్ సాబ్ టీమ్ ప్లాన్ చేస్తోంది. అయితే ఈ టీజర్ కట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయట. అలాగే ఈ టీజర్ కట్ కు ఎడిటర్ ప్రవీణ్ పూడి పని చేస్తున్నట్టుగా చెబుతున్నారు. ఈ సినిమా నుండి వచ్చిన ఒక అఫీషియల్ లుక్, కొన్ని లీక్ద్ పిక్స్ సోషల్ మీడియాని పట్టి కుదిపాయి,  మరిప్పుడు టీజర్ తో ఎన్ని సంచలనాలు నమోదు అవుతాయో చూడాలి.  

More Related Stories