English   

ప‌వ‌న్-వ‌ర్మ‌ వైరం ఈ నాటిది కాదండోయ్..!

Pawan-Kalyan-RGV

ప‌వ‌న్ క‌ళ్యాణ్-వ‌ర్మ‌.. ఇన్నాళ్లూ ఈ ఇద్ద‌రి పేర్లు ప‌క్క‌నబెట్టి చదివితే తెలియ‌ని వైబ్రేష‌న్ ఏదో వ‌చ్చేది. ఎంత వ‌చ్చినా కూడా ఇప్ప‌టి వ‌ర‌కు హ‌ద్దులు అయితే దాట‌లేదు ఈ ఇద్ద‌రూ. కానీ ఇప్పుడు వ‌ర్మే దాటాడు. ఏకంగా ప‌వ‌న్ వ్య‌క్తిగ‌త విష‌యాల‌నే గెలికేసాడు. దాంతో ఎప్పుడూ సీరియ‌స్ అవ్వ‌ని ప‌వ‌ర్ స్టార్ కూడా ఇప్పుడు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నాడు. నేను రంగంలోకి దిగితే ఎలా ఉంటుందో చూపిస్తానంటూ బ‌య‌ల్దేరాడు ఇప్పుడు. అయితే ప‌వ‌న్-వ‌ర్మ మ‌ధ్య వైరం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది కానీ ఈ ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ మాత్రం పాతికేళ్ళ కిందే మొద‌లైంది. అస‌లు అప్ప‌ట్లో శివ సినిమా హిట్టైన త‌ర్వాత వ‌ర్మ‌ను ప్ర‌త్యేకంగా అభినందించాడు చిరంజీవి. ఆ కార్య‌క్ర‌మంలో చిరుతో పాటు అత‌డి త‌మ్ముళ్లు నాగ‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా ఉన్నారు. కొండ‌వీటి దొంగ షూటింగ్ టైమ్ లో వ‌ర్మ‌ను క‌లిసాడు చిరంజీవి. అప్పుడు చిరు చేస్తోన్న సినిమాపై కాస్త చనువు తీసుకుని కొన్ని మాట‌లు అనేసాడు వ‌ర్మ‌. ఇప్ప‌టికీ మీరు ఇలాంటి సినిమాలు చేయ‌డం ఏంటి చిరంజీవి గారు.. మీ రేంజ్ ఇది కాదు.. నాతో రండి చూపిస్తా అంటూ కాస్త ఎక్కువ‌గానే మాట్లాడేస‌రికి ప‌వ‌న్ కు కోపం వ‌చ్చి అక్క‌డ్నుంచి కుర్చీని త‌న్నుకుంటూ వెళ్లిపోయాడంటారు విశ్లేష‌కులు. అదిగో ఆ క్ష‌ణం నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు వ‌ర్మ చేస్తోన్న ప‌నులేవీ ప‌వ‌న్ కు పెద్ద‌గా న‌చ్చ‌వ‌నే టాక్ ఉంది ఇండ‌స్ట్రీలో. పైగా అప్ప‌ట్లో రైజింగ్ లో ఉన్న‌పుడు సినిమా మ‌ధ్య‌లో ఆపేసి బాలీవుడ్ వెళ్లి చిరుతో కూడా సున్నం పెట్టుకున్నాడు వ‌ర్మ‌. దాంతో ఈ ద‌ర్శ‌కుడిపై మ‌రింత మండిప‌డ్డాడు ప‌వ‌ర్ స్టార్. ఇక అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఈయ‌నపై మంచి అభిప్రాయం రాలేదు. ఇప్పుడు ఆయ‌న చేస్తున్న ప‌నుల‌కు వ‌చ్చేలా కూడా లేదు. ఇక ఇప్పుడు జ‌రిగిన తీరుకు పూర్తిగా మెగా కుటుంబంతో వ‌ర్మ‌కు సంబంధాలు తెగిపోయినట్లే క‌నిపిస్తున్నాయి. మొత్తానికి ఫ్యాక్ష‌న్ సినిమాలా పాతికేళ్ల వైరాన్ని వెంట పెట్టుకుని తిరుగుతున్నారు వ‌ర్మ‌-ప‌వ‌న్ క‌ళ్యాణ్. 

More Related Stories