English   

 రంగ‌స్థ‌లం ప‌వ‌న్ చూసాడా..? 

Pawan-Kalyan-Rangasthalam
2018-04-03 13:41:09

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇప్పుడు ఎంత బిజీగా ఉన్నాడో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. సినిమాలు కూడా వ‌దిలేసి పూర్తిగా రాజ‌కీయాల్లోనే బిజీ అయ్యాడు ప‌వ‌ర్ స్టార్. ఇలాంటి టైమ్ లో ఆయ‌న‌కు సినిమాలు తీసే తీరిక‌.. చూసే ఓపిక రెండూ క‌ష్ట‌మే. కానీ ఇప్పుడు ఈయ‌న ఓ సినిమా చూసార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. అది మ‌రేదో కాదు.. రామ్ చ‌ర‌ణ్ తాజా సంచ‌ల‌నం రంగ‌స్థ‌లం. ఈ చిత్రాన్ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌త్యేకంగా షో వేయించుకుని చూసార‌ని తెలుస్తుంది. ఈ షోలో ప‌వ‌న్ తో పాటు ద‌ర్శ‌కుడు సుకుమార్.. హీరో రామ్ చ‌ర‌ణ్ కూడా ఉన్నార‌ని.. సినిమా చూసిన త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్ చాలా ఎగ్జైట్ అయ్యార‌ని తెలుస్తుంది. ఇన్నాళ్లూ చ‌ర‌ణ్ లోని న‌టుడు బ‌య‌టికి రాలేద‌ని.. ఇప్పుడు వ‌చ్చాడ‌ని.. రంగ‌స్థ‌లం చూసిన త‌ర్వాత చ‌రణ్ ని చూసి చాలా గ‌ర్వంగా ఉంద‌ని ప‌వ‌న్ చాలా ఎగ్జైట్ అయిన‌ట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ లో ఆది చ‌నిపోయిన‌పుడు చ‌ర‌ణ్ చేసిన న‌ట‌న‌ను చూసి ప‌వన్ చాలా అభినందించాడ‌ని తెలుస్తుంది. బాబాయ్ రియాక్ష‌న్స్ చూసి చ‌ర‌ణ్ కూడా చాలా ఆనందించాడు. ఇప్ప‌టికే చిరంజీవి కూడా త‌న‌యుడి సినిమా చూసి పుత్రో త్సాహంతో పొంగిపోతున్నాడు. ఇప్పుడు బాబాయ్ కూడా చ‌ర‌ణ్ ను ఆకాశానికి ఎత్తేసాడు. మొత్తానికి ఇంత బిజీ షెడ్యూల్ లో కూడా టైమ్ చూసి అబ్బాయి సినిమా చూసి ఆనందించాడు ప‌వ‌ర్ స్టార్. 
 

More Related Stories