English   

పవన్ కళ్యాణ్ భార్య పిల్లలతో కలిసి వెళ్ళాడు

Pawan Kalyan Went Chiranjeevi House to wish Birthday Greetings
2018-08-23 07:37:30

అన్నయ్యంటే తనకు ఎంతో గౌరవమని పవన్ కళ్యాణ్ ఎన్నోసార్లు చెప్పుకున్నాడు. పొలిటికల్ గా విభేదాలున్నా.. అన్నదమ్ముల అనుబంధంలో ఆ భేదాలు లేవని ఈ ఇద్దరూ చాలాసార్లు ప్రూవ్(అవసరం లేకపోయినా) చేసుకున్నారు కూడా.. ఇప్పటికీ ఎన్నో పొలిటికల్ స్పీచెస్ లో అన్నయ్యే తనకు ఆదర్శం, అన్నీ అని చెబుతుంటాడు పవన్ కళ్యాణ్. అలాంటి అన్నయ్య బర్త్ డే రోజున స్వయంగా వెళ్లి కలిసి మరీ వచ్చాడు. అది కూడా సతీసమేతంగా.. తన మూడో భార్య అన్నా లెజినోవాతో కలిసి అన్నయ్యను కలిసి బర్త్ డే విషెస్ చెప్పాడు.

ఈ సందర్బంగా విడుదల చేసిన ఫోటోస్ నెటిజిన్స్ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా పవన్ వైఫ్ భారతీయ కట్టుబొట్టుతో ఉండటం ఎంతోమందికి నచ్చింది. అయితే ఈ దంపతులతో పాటు మరో ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. ఆ థర్డ్ కిడ్ ఎవరనేది కొందరికి తెలియడం లేదు. దీంతో శ్రీజ కూతురని కొందరు.. కాదని కొందరు సోషల్ మీడియాలో చర్చలకు దిగారు. ఏదేమైనా అన్నయ్య బర్త్ డే అంటే తనకు పండగలాంటిదని పవన్ మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. 

More Related Stories