English   

రేణు పెళ్లిపై పవన్ సెన్షేషనల్ ట్వీట్.. 

Renu-Desai
2018-06-26 12:10:51

రేణుదేశాయ్ పెళ్లి చేసుకోబోతోంది. ఈ మధ్య కాలంలో హాటెస్ట్ టాపిక్ ఇదే. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ద్వారా ఇద్దరు బిడ్డల తల్లి అయిన రేణు.. మళ్లీ పెళ్లి చేసుకుంటోందంటే.. చాలామంది పవన్ అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. అటు పవన్ కూడా రేణుకు విడాకులు ఇచ్చిన తర్వాత వెంటనే రెండో పెళ్లి చేసుకున్నాడు. అలాంటప్పుడు రేణు మళ్లీ పెళ్లి చేసుకుంటే తప్పేంటని మరికొంతమంది వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె మ్యారేజ్ పై పవన్ కళ్యాణ్ సెన్షేషనల్ కమెంట్స్ చేశాడు. 

‘జీవితంలో ఓ కొత్త ఆనందకమరైన ఫేజ్ లోకి ఎంటర్ కాబోతోన్న మిస్ రేణు దేశాయ్ గారికి నా హృదయపూర్వక అభినందనలు. ఆమె అత్యున్నతమైన ఆనందకరమైన జీవితం కోసం నేను ప్రార్థిస్తున్నాను’.. ఇది పవన్ కళ్యాణ్ రేణూదేశాయ్ పెళ్లిపై స్పందిస్తూ చేసిన ట్వీట్. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అయిపోయింది. ఇప్పటి వరకూ ఎవరేమనుకున్నా పట్టించుకోలేదు కానీ.. ఇప్పుడు ఏకంగా పవన్ కళ్యాణే రేణుకు సపోర్ట్ గా ట్వీట్ చేయడంతో అభిమానులు కూడా సైలెంట్ అయిపోతున్నారు. నిజానికి ఇది రేణూదేశాయ్ కి కొండంత సపోర్ట్ ఇచ్చే ట్వీట్. లేదంటే ఇప్పటికే ఆయన అభిమానులు ‘వదిన’ తప్పు చేస్తున్నావ్ అంటూ జబర్దస్త్ లో అప్పారావ్ లా మాట్లాడుతుంటే పాపం తను ప్రతిదానికి ఆన్సర్ ఇస్తూ ఇబ్బంది పడేది. ఇక పవన్ కళ్యాణ్ ట్వీట్ తో ఫ్యాన్స్ కూడా కామ్ గా ఉంటే ఆమె హ్యాపీగా తన బతుకేదో తను బ్రతుకుతుంది.. 

More Related Stories