English   

పింక్ తెలుగు రీమేక్ కు సర్వం సిద్ధం.. పవన్ ఎప్పుడు వస్తాడంటే..

Pawan Kalyan
2020-01-18 11:09:30

చాలా రోజులుగా పవన్ అభిమానులు ఎదురుచూస్తున్న పింక్ సినిమా రీమేక్ పనులు మొదలయ్యాయి. ఈ సినిమా వీలైనంత త్వరగా పట్టాలెక్కించేయాలని చూస్తున్నాడు దర్శకుడు శ్రీరామ్  వేణు. మరోవైపు దిల్ రాజు కూడా నిర్మాణ బాధ్యతలు అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నాడు.  20 ఏళ్లుగా పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని సన్నాహాలు చేసుకుంటున్న ఆయనకు ఇన్ని రోజుల తర్వాత అవకాశం వచ్చింది. దాంతో దాన్ని చేజారకుండా  తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. 

తనకు సినిమాలు వద్దు రాజకీయాలు ముద్దు అని కొన్ని రోజులుగా పాలిటిక్స్ లో బిజీగా ఉన్నాడు పవన్ కళ్యాణ్. ఇప్పట్లో తనకు సినిమాలు చేసే ఉద్దేశ్యం లేదని.. తాను అసలు సినిమాల్లో నటించనని తెగేసి చెప్పాడు పవర్ స్టార్. కానీ నిర్మాతలు మాత్రం పవన్ కళ్యాణ్ ను అస్సలు వదిలిపెట్టడం లేదు. ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదు.. మీకు కుదిరినప్పుడు మాకు ఒక సినిమా చూసి పెట్టండి చాలు అంటూ ఆయన చుట్టూ కొందరు నిర్మాతలు ఎప్పుడూ తిరుగుతూనే ఉన్నారు. అందులో ముఖ్యంగా మైత్రి మూవీ మేకర్స్, ఏఎం రత్నం, రామ్ తళ్లూరి లాంటి వాళ్ళున్నారు. వీళ్లందరినీ కాదని రేసులో ముందుకు వెళ్ళిపోయాడు దిల్ రాజు. 

బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ తో కలిసి తెలుగులో పింక్ సినిమాను రీమేక్ చేయబోతున్నాడు. ఈయన ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ను ఒప్పించడం.. ఆయన డేట్స్ కూడా తీసుకోవడం జరిగింది . అయితే పవన్ కళ్యాణ్ మాత్రం తనకు ఇప్పట్లో సినిమాలు చేసే ఉద్దేశ్యం లేదని చెప్పడంతో అసలు సెట్స్ పైకి వెళ్తుందా లేదా అనే అనుమానాలు అందరిలోనూ కనిపిస్తున్నాయి. ఈ సమయంలో పింక్ రీమేక్ పనులు మరింత వేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా కోసం అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రత్యేకంగా కోర్టు సెట్ నిర్మాణం జరుగుతుంది.  డిసెంబర్ రెండవ వారం నుంచి  పింక్ రీమేక్ మొదలు కానుందని వార్తలొచ్చినా కూడా జనవరి 20 నుంచి ఈ సినిమా పట్టాలెక్కబోతుంది. 

తెలుగులో లాయర్ సాబ్ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. కేవలం 45 రోజుల్లోనే సినిమా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు దర్శకనిర్మాతలు. 2020 మేలో సినిమాను విడుదల చేయనున్నారు. బాలీవుడ్ లో సంచలన విజయం సాధించిన పింక్ సినిమా రీమేక్ లో పవన్ కళ్యాణ్ నటిస్తే బాగుంటుందని.. ముఖ్యంగా అమ్మాయిలపై జరుగుతున్న అఘాయిత్యాల గురించి ఈ సినిమాలో చూపించారు కాబట్టి.. ఒక సామాజిక బాధ్యత ఉన్న హీరో నటిస్తే ప్రేక్షకులకు మరింతగా రీచ్ అవుతుందని పవన్ కళ్యాణ్ తో ఈ సినిమా చేస్తున్నట్లు చెప్పాడు నిర్మాత బోనీకపూర్. 

అమితాబ్ బచ్చన్, తాప్సి ప్రధాన పాత్రలో నటించిన పింక్ బాలీవుడ్ లో సంచలన విజయం సాధించింది. ఇదే సినిమాను తమిళనాట అజిత్ హీరోగా నెర్కొండ పార్వై పేరుతో రీమేక్ చేస్తే అక్కడ కూడా సూపర్ హిట్ అయింది. దాంతో ఇప్పుడు తెలుగులో సినిమా పవన్ కళ్యాణ్ తో రీమేక్ చేయాలని చూస్తున్నారు. మరి చూడాలిక.. పవన్ రీ ఎంట్రీ ఎలా ఉండబోతుందో..?

More Related Stories