English   

సెప్టెంబర్ లో షూట్ ఫ్లాన్ చేస్తున్న వకీల్ సాబ్  

Pawan Kalyan
2020-07-05 18:38:34

రాజకీయాలతో బీజీ అయిన పవన్ కళ్యాణ్ బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్ రీమేక్ తో రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.  కరోనా రాకుండా వున్నట్టయితే ఈపాటికి వకీల్ సాబ్ థియేటర్లలో సందడి చేసేవాడు.  మహమ్మారి వైరస్ వలన ఈ సినిమా షూటింగ్ ఇరవై శాతం బ్యాలెన్స్ వుండిపోయింది.  లాక్ డౌన్ సడలింపుల కారణంగా షూటింగ్ లకు అనుమతిచ్చిన నేపథ్యంలో వకీల్ సాబ్ పున: ప్రారంభించినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే పవన్ కళ్యాణ్  ఇప్పట్లో  షూట్ మెదలు పెట్టేందుకు ఆసక్తిగా లేరని తెలుస్తోంది.   అందుకే సెప్టెంబర్ వరకు షూటింగ్ ను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారు.  అయితే సెప్టెంబర్ చివరి వారంలో షూటింగ్ కు పవన్ ఓకే చేప్పినట్లు సమాచారం. అన్నీ కుదిరితే బ్యాలెన్స్ ఇరవై శాతం షూట్ పూర్తి చేసి...దీపావళి కి దించేందుకు దిల్ రాజు ప్లాన్ చేస్తున్నట్టు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

More Related Stories