English   

ప‌వ‌న్.. ర‌జినీ.. ఇద్ద‌రూ ముంచేస్తున్నారు..!

pawan rajini
2018-07-26 21:09:00

ర‌జినీకాంత్.. ప‌వ‌న్ క‌ళ్యాణ్.. ఇద్ద‌రూ ఇద్ద‌రే. ఇమేజ్ లో ఆకాశాన్ని లెక్కేయాలి. క‌లెక్ష‌న్స్.. క్రేజ్.. మార్కెట్ ఎలా చూసుకున్నా కూడా ర‌జినీ త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆ స్థానంలోనే ఉంటాడు. సినిమాల‌తో మాత్ర‌మే వ‌చ్చిన ఇమేజ్ కాదు ఇది. ఇంకేదో కావాలి.. అది చూసి ప్రేక్ష‌కులు ఈ ఇద్ద‌ర్ని అంత‌గా ఇష్ట‌ప‌డుతున్నారు. ఇలాంటి ఇద్ద‌రు ఇప్పుడు ఒకే ప‌రిస్థితుల్లో ఉండ‌టం విచిత్రంగా అనిపిస్తుంది. ఇద్ద‌రికి కొన్నేళ్లుగా హిట్లు లేవు.. వ‌ర‌స డిజాస్ట‌ర్ల‌తో బ‌య్య‌ర్ల‌ను నిలువునా ముంచేస్తున్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌ర్దార్.. కాట‌మ‌రాయుడు.. అజ్ఞాత‌వాసితో చుక్కులు చూపించాడు. ఇక ర‌జినీకాంత్ కూడా లింగా.. క‌బాలి.. కాలా లాంటి సినిమాల‌తో ఫ్లాపులు ఇచ్చాడు. 

పైగా రాజ‌కీయంగానూ ఇద్ద‌రూ అనుభ‌వం లేనివాళ్లే. ఏదో చేస్తార‌ని ప్ర‌జ‌లు న‌మ్ముతున్నారు కానీ వీళ్ల‌ను చూస్తుంటే మాత్రం అలా క‌నిపించ‌డం లేదు. ఓ వైపు ఎన్నిక‌ల‌కు ఏడాది టైమ్ కూడా లేదు.. కానీ ఇద్ద‌రూ ఎల‌క్ష‌న్స్ ను సీరియ‌స్ గా తీసుకోవ‌డం లేదు. త‌మ త‌మ పార్టీల్లో తాము త‌ప్ప సెకండ్ గ్రేడ్ లీడ‌ర్స్ లేకుండానే ఉన్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు అయితే పార్టీ క్యాడ‌ర్ కూడా లేదు. ర‌జినీకాంత్ క‌నీసం పార్టీ కూడా పెట్ట‌లేదు. పైగా ఈ ఇద్ద‌రూ ఎప్పుడు ఎలా ఉంటారో ఎవ‌రికీ అర్థం కాదు. అప్ప‌టిక‌ప్పుడు సినిమాలంటారు.. అప్ప‌టిక‌ప్పుడే రాజ‌కీయాలంటారు. ఏదీ పూర్తిగా చేయ‌కుండా అటు ఆకాశ‌మంత అభిమానాన్ని.. న‌మ్మ‌కాన్ని కూడా పోగొట్టుకునే ప‌రిస్థితికి వ‌చ్చారు. దృష్టి పెడితే క‌చ్చితంగా అద్భుతాలు చేసే స‌త్తా ఉన్నా కూడా ఎటూ కాకుండా ఒకే దారిలో వెళ్తున్నారు ఈ ఇద్ద‌రూ. మ‌రి వీళ్లేం మాయ చేస్తార‌నేది కాల‌మే నిర్ణ‌యించాలి.

More Related Stories