English   

ప‌వ‌న్ స్థానంపై క‌న్నేసిన నాని..

nani and pawan
2018-02-27 19:32:32

అదేంటి.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎక్క‌డ‌.. నాని ఎక్క‌డా.. ఆయ‌న స్థానం ఈయ‌న తీసుకోవ‌డం ఏంటి అనుకుంటున్నారా..? ఇండ‌స్ట్రీలో కొన్నిసార్లు ఇలాంటి విచిత్రాలు జ‌రుగుతూ ఉంటాయి. ఇప్పుడు కూడా ఇదే జ‌రుగుతుంది. ఒక‌రు చేయాల్సిన క‌థ‌లు మ‌రొక‌రికి వెళ్ల‌డం ఇక్క‌డ స‌హ‌జం. నాని కూడా ఇప్పుడు ఇదే చేస్తున్నాడు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కోసం సిద్ధం చేసిన క‌థ‌లోకి నాని వ‌స్తున్నాడు. ఇది నిజంగా నిజ‌మే. ఆయ‌న ఇమేజ్.. ఈయ‌న  ఇమేజ్ వేరు వేరు కానీ.. ఆ క‌థ ఇప్పుడు న్యాచుర‌ల్ స్టార్ కు బాగా సెట్ అయ్యేలా ఉంది. అదే సంతోష్ శ్రీ‌నివాస్ క‌థ‌. ఈయ‌న మైత్రి మూవీ మేక‌ర్స్ కు ఓ సినిమా చేయాల్సి ఉంది. ప‌వ‌న్ తో అనుకున్నా అది వ‌ర్క‌వుట్ అవ్వ‌లేదు. ఇక వేచి చూసినా లాభం లేద‌నుకుని నానితో ఆ సినిమా ప్లాన్ చేస్తున్నారు మైత్రి సంస్థ‌. ఈ బ్యాన‌ర్ లో కిషోర్ తిరుమ‌ల‌తో నాని ఓ సినిమా చేయాల్సి ఉంది. అది అనుకోకుండా సాయిధ‌రంతేజ్ కు వెళ్లిపోయింది. దాంతో డేట్స్ అలాగే ఉన్నాయి. ఈ డేట్స్ ను ఇప్పుడు సంతోష్ సినిమా కోసం వాడుకుంటున్నారు. ఇదే ఏడాది సినిమా ప‌ట్టాలెక్కే అవ‌కాశం లేక‌పోలేదు. నాని ప్ర‌స్తుతం నాగార్జున మ‌ల్టీస్టార‌ర్ తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా త‌ర్వాత మైత్రి ఉండొచ్చ‌నేది తెలుస్తుంది.

More Related Stories