English   

పెళ్లైనా లాస్యను వ‌ద‌ల‌ట్లేదుగా..

Peli-Ayina-Lasya-Vadalatleduga
2017-05-04 02:55:08

తెలుగు బుల్లితెర‌పై త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న యాంక‌ర్ లాస్య‌. ర‌విలాస్య‌గా ఈ భామ‌కు క్రేజ్ ఉంది. ర‌వితో విడిపోయిన త‌ర్వాత‌.. ఆమె స‌ప‌రేట్ గా ప్రోగ్రామ్స్ చేసింది. ఈ మ‌ధ్యే మంజునాధ్ అనే కుర్రాన్ని పెళ్లి చేసుకుంది లాస్య‌. పెళ్లికి ముందు ఈమెపై బోలెడ‌న్ని రూమ‌ర్లు వ‌చ్చాయి. ఆ మ‌ధ్య సూసైడ్ అటెంప్ట్ చేసింద‌ని ఓ సారి.. ర‌వితో పెళ్లైపోయింద‌ని మ‌రోసారి.. ఇలా బోలెడ‌న్ని రూమ‌ర్లు వ‌స్తూనే ఉన్నాయి. వీటికి లాస్య కూడా ఓపిగ్గా స‌మాధానం ఇచ్చింది. ఇక ఇప్పుడు పెళ్లైన త‌ర్వాత లాస్య‌పై గాసిప్పులు మాత్రం ఆగ‌డం లేదు.

పెళ్లై మూడు నెల‌లు కూడా కాలేదు అప్పుడే లాస్య గ‌ర్భ‌వ‌తి అంటూ వార్త‌లొస్తున్నాయి. దీనికి స్పందించిన లాస్య‌.. వెంట‌నే సెటైరిక‌ల్ గా స‌మాధానం ఇచ్చింది. మూన్నెళ్లు కూడా కాక‌ముందే అప్పుడే గ‌ర్భ‌వ‌తి అంటూ రూమ‌ర్లు పుట్టించిన వాళ్ల‌కు దండేసి దండం పెడ‌తానంటుంది ఈ ముద్దుగుమ్మ‌. మొత్తానికి పెళ్లికి ముందు.. ఆ త‌ర్వాత కూడా లాస్య రూమ‌ర్స్ జ‌ర్నీ మాత్రం ఆగ‌ట్లేదు.

More Related Stories