English   

బాహుబ‌లి దానికి ప‌నికిరాద‌న్న రెహ్మాన్..

People-Will-Get-Tired-To-Watch-Baahubali-2-In-VR-Says-AR-Rahman
2017-05-09 06:48:44

బాహుబ‌లి.. బాహుబ‌లి.. ఇప్పుడు ఎక్క‌డ విన్నా ఇదే పేరు వినిపిస్తుంది. ఏకంగా ఇండియ‌న్ సినిమా రికార్డుల‌ని తిర‌గ‌రాస్తూ 1000 కోట్లు వ‌సూలు చేసింది ఈ చిత్రం. ఇలాంటి సినిమాపై ఇప్పుడు ఏఆర్ రెహ్మాన్ ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేసాడు. ఈ సినిమాను విఆర్ టెక్నాల‌జీలో విడుద‌ల చేయాల‌ని చూస్తున్నాడు రాజ‌మౌళి. ఇప్ప‌టికే ఆ క్ర‌మంగా టెక్నాల‌జీ డెవ‌లప్ చేస్తూ.. విఆర్ వర్ష‌న్ ను సిద్ధం చేస్తున్నాడు ద‌ర్శ‌క‌ధీరుడు. అయితే బాహుబ‌లి సినిమాను విఆర్ లో చూడ‌టం క‌ష్ట‌మ‌ని తేల్చేసాడు రెహ్మాన్. అలాంటి సినిమాను తెర‌పై చూడ‌ట‌మే ఉత్త‌మం అని.. బాహుబ‌లి అద్భుత‌మైన సినిమా అయినా.. వ‌ర్చువ‌ర్ రియాలిటీలో బాహుబ‌లిని ఎక్కువ సేపు ప్రేక్ష‌కులు చూడ‌లేర‌ని చెబుతున్నాడు రెహ్మాన్.

యుద్ద స‌న్నివేశాలు చూసేస‌రికి బోర్ వ‌చ్చేస్తుందంటున్నాడు రెహ్మాన్. త‌న‌కు కూడా విఆర్ లో సినిమాలు చేయ‌డం రాద‌ని.. త‌న‌కు తెలిసింద‌ల్లా మంచి సంగీతం అందించ‌డం.. మంచి సినిమాలు తీయ‌డం మాత్ర‌మే అన్నాడు ఈ సంగీత ద‌ర్శ‌కుడు. ఈయ‌న లే మాస్క్ అనే షార్ట్ ఫిల్మ్ తో ద‌ర్శ‌కుడిగా మారుతున్నాడు. ఈ సినిమా కూడా విఆర్ లోనే వ‌స్తుండ‌టం విశేషం. మొత్తానికి బాహుబ‌లిపై ఇప్పుడెవ‌రూ ఎలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డానికి సాహ‌సించ‌ట్లేదు. ఇలాంటి టైమ్ లో ఎఆర్ రెహ్మాన్ మాత్రం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసాడు.

More Related Stories