English   

పేట ఫస్ట్ టాక్....తలైవా ఈజ్ బ్యాక్ !

Petta
2019-01-10 04:47:07

సూప‌ర్ స్టార్ ర‌జినీ కాంత్ తాజాగా విడుదలయిన 2.0 సినిమాతో ఎంత పెద్ద హిట్  కొట్టాడో తెలయనిది కాదు. ఆయన నుండి వస్తున్న తాజా సినిమా పేట. జిగర్ తండా ఫేం కార్తీక్ సుబ్బరాజ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాలో సిమ్రాన్, త్రిష‌, హీరోయిన్లుగా న‌టిస్తుండ‌గా న‌వాజుద్దీన్ సిద్ధిఖీ, విజ‌య్ సేతుప‌తి, మేఘా ఆకాష్ లాంటి నటులు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ప్రీమియర్ షోల నుండి వస్తున్న సమాచారం మేరకు సినిమా అదిరి పోయిందని, రజినీకాంత్ తన పాత రోజులని గుర్తు చేశాడని అంటున్నారు. కొంత మందయితే ఏకంగా ఇది బాషా సినిమాను మించి ఉందని అంటున్నారు. హాస్టల్ వార్డెన్‌గా రజినీ నటన, కామెడీ, ఫైట్లు, మాస్ పాటలు ఇలా ఒక్కొక్క దానిలో తన స్టైల్ చూపించాడని అంటున్నారు. ఫస్టాఫ్‌ లో వచ్చే ఒక ట్విస్ట్, ఇంటర్వల్  సినిమాకే హైలైట్ అంటున్నారు. మొట్టమొదటి సారిగా రజనీకి అనిరుద్ సంగీతం అందించగా ఆయన ఇచ్చిన బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్ సినిమాని ఒక రేంజ్లో ఉంచుతుందట. చాలా కాలం తరవాత పాత రజినీని పేట సినిమా గుర్తు చేసిది. పెద్దగా అంచనాలు లేకుండానే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘పేట’ చిత్రానికి ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ప్రీమియర్ చుసిన వాళ్ళు సినిమా సూప‌ర్ హిట్ అంటున్నారు. ప్రస్తుతానికి అయితే సినిమా మీద పాజిటివ్ బాజ్ నడుస్తోంది. ఫైనల్ అవుట్ పుట్ ఏమవుతుందో మరి !

More Related Stories