English   

‘పేట’రివ్యూ

peta-review
2019-01-10 12:50:06

రజనీకాంత్ అనే పేరుకుండే స్టైయిల్ రీసెంట్ సినిమాలో తగ్గుతూ వస్తుంది. రజనీ కుండే స్ట్రంగ్త్ ని వదిలేసిన కథలు ప్రేక్షకులు తిప్పి కొట్టారు. కానీ యువ దర్శకుడు కార్తికేయ సుబ్బరాజ్ ఆ స్టైల్ ని రిలోడ్ చేసాడనే టాక్ పేట తెచ్చకుంది . రజనీ మాస్ ఇమేజ్ ఎలాంటి మ్యాజిక్ లు చేసిందో చూద్దాం..

కథ :

పేట (రజనీ) ఒక కాలేజ్ కి హాస్టల్ వార్డెన్ గా జాయిన్ అవుతాడు. అక్కడ కుర్రాళ్ళు చేసే ర్యాగింగ్ ని కంట్రోల్ చేసి, పరిస్థితులు చక్కదిద్ది కాలేజ్ స్టూడెంట్స్ లో మంచి ఇమేజ్ ని తెచ్చుకుంటాడు. ఒక ప్రేమ జంట ప్రాబ్లమ్ ని పరిష్కరించబోయి లోకల్ డాన్ తో గొడవ పడతాడు. ఆ గ్యాంగ్ రజనీ మీద ఎటాక్ చేసేందుకు హాస్టల్ కి వస్తుంది. అయితే ఆ గ్యాంగ్ లో కలిసిన మరికొందరు రౌడీలుంటారు. వారు రజనీ ని చంపాలని ట్రై చేస్తారు. రజనీ గతం లో ఎం జరిగింది. ఎందుకు రజనీ ని చంపేందుకు వారు ట్రై చేసారు..? రజనీ కాపాడిన ప్రేమజంట ఎవరు..? అనేది మిగిలిన కథ

కథనం:

రజనీ కుండే బలం ఎంటో కరెక్ట్ గా అంచనా వేసుకొని ఆ బలాలను అత్యంత ప్రతిభావంతంగా కథలో వాడు కున్నాడు దర్శకుడు. రజనీ ఇంట్రడక్షన్ సీన్ లో వినిపంచే పాట దగ్గరనుండి రజనీ కనిపించిన ప్రతిసారి ఒక ఎనర్జీని నింపాడు. హాస్టల్ బ్యాక డ్రాప్ లో కథ అనగానే అక్కడ ఉండే వాతావరణం నుండిఫన్ ని జనరేట్ చేసాడు దర్శకుడు. ఇక సిమ్రన్ తో రజనీ చేసే ప్రాణిక్ హీలింగ్ ఎపిసోడ్ చాలా ఫన్ గా ఉంది. ఒక కొత్త తరహాలో కథను నడపించడంలో దర్శకుడు పూర్తిగా సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. ఇంకా రజనీ స్టైల్ ని పూర్తిగా ఎంజాయ్ చేయవచ్చు. ఈ మద్యకాలంలో వచ్చిన రీసెంట్ రజనీ మూవీస్ లో మిస్ అయిన కిక్ పేట లో పూర్తిగా దొరుకుతుంది. హీరోయిజం ను ఎలివేట్ చేసేందుకు కార్తీక్ సుబ్బరాజ్ డిజైన్ చేసిన సన్నివేశాలు చాలా బాగున్నాయి. రజనీ బెదిరించేందుకు వచ్చిన ఒక గ్యాంగ్ అతను కూర్చునే స్టైయిల్ చూసి అతనేంటో అంచనా వేస్తుంది. అలాంటి సన్నివేశాల్లో ఫ్యాన్స్ కి పూనకాలు వస్తాయి. ఇక రజనీ కి వయస్సు అయిపోలేదు అనేందుకు నాన్ చాక్ తిప్పుతూ కనిపించే సన్నివేశాలు చాలా ఎనర్జిటిక్ గా ఉన్నాయి. తిరు సినిమాటోగ్రఫీ రజనీ స్టైల్ కి బలంగా మారింది. కొత్తదనం నిండిన ఆలోచనలతో రజనీ ఫ్యాన్స్ కి పండగలా మారిన పేట సెంకండాఫ్ కొచ్చే సరికి రోటీన్ రివైంజ్ డ్రామాలో పడిపోయింది. తనను పెంచి పెద్ద చేసిన వారికోసం ఎంత వరకూ అయినా వెళ్ళే పాత కథానాయకుడు దారిలోనే రజనీ ప్రయాణం మొదలు పెట్టాడు. ప్లాష్ బ్యాక్ అయి పోయిన తర్వాత కథ మరింత డ్రాగ్ చేసాడు దర్శకుడు అనిపించింది. నార్త్ ఇండియ్ లో సాగే కథనం అంతా రోటీన్ గా వెళ్ళింది. అక్కడి నుండి విజయశేతుపతి క్యారెక్టర్ తో ప్లే మొదలు పెట్టాడు దర్శకుడు సహాజంగా మంచి నటుడు అయిన విజయశేతుపతి జిత్తు క్యారెక్టర్ లో మంచి నటన కనబరిచాడు. స్టైయిల్ గా సరదాగా సాగే కథనం మళ్లీ రోటీన్ రివైంజ్ డ్రామాలో పడిందనే డిజప్పాయింట్ ప్రేక్షకులకు కలుగుతుంది. ఇంకా రజనీ మూవీస్ నుండి ఇలాంటి పాత కథలు ఆశించలేం. నవాజుద్దీన్ నటన బాగుంది. కానీ విలన్ గా బయపెట్టడం కంటే బయపడటం తోనే అతని పాత్ర సరిపోయింది. త్రిషా పాత్రకు పెద్దగా స్ర్కీన్ ప్లేస్ లేదు, సిమ్రన్ పాత్ర అర్ధాంతరంగా ముగిసిందనే ఫీల్ కలుగుతుంది. సెకండాఫ్ ని సాగదీసి పేట కుండే కిక్ ని చెడగొట్టాడు అనిపించింది. ప్రీ క్లైమాక్స్ ని ఊపందుకున్న పేట క్లైమాక్స్  ట్విస్ట్ తో కాస్త రిలీఫ్ చేసాడు. 

చివరిగా: మిస్ అయిన రజనీ స్టైల్ ఆకట్టుకున్నా రోటీన్ రివైంజ్ డ్రామా భారంగా అనిపించింది. రజనీ మార్క్ స్టైయిల్ కోసం అయితే ఓకే లేదంటే పేట కు టాటా చెప్పవచ్చు.

రేటింగ్: 3/5

More Related Stories