English   

PM రిలీఫ్ ఫండ్‌కు 50 లక్షల విరాళమిచ్చిన కమెడియన్.. 

Kapil Sharma
2020-03-27 15:12:31

కరోనా మహమ్మారిపై ప్రస్తుతం ప్రపంచమంతా ఏకమై పోరాడుతుంది. ప్రతీ దేశాన్ని కూడా ఈ వైరస్ కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఇక ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్లు కూడా వేలల్లో ఉన్నారు. ఆకలితో అలమటిస్తున్న వాళ్లు.. దిక్కు లేకుండా పోయిన వాళ్లు కూడా చాలా మందే ఉన్నారు. వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలకు.. అలాగే వైరస్ తో నష్టపోయిన వాళ్లకు అండగా నిలిచాడు బాలీవుడ్ స్టార్ కమెడియన్ కపిల్ శర్మ. 

తన వంతు సాయంగా ప్రధానమంత్రి సహాయనిధికి 50 లక్షల విరాళం ప్రకటించాడు ఈయన. అది చూసి అంతా ఒక్కసారిగా షాక్ అయిపోయారు. హీరోలు కూడా ఇప్పటి వరకు అంత ఇవ్వలేదు కానీ ఏకంగా కపిల్ శర్మ మాత్రం 50 లక్షలు ఇచ్చేసాడు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ కూడా పెట్టాడు కపిల్. మన సాయం అవసరమైన వాళ్ల కోసం అందరం ఒక్కటవ్వాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలిపాడు కపిల్. ఈయన సాయం చూసిన వాళ్లంతా చేతులెత్తి దండం పెడుతున్నారు. 

ఇక కపిల్ కూడా జనమంతా ఇంట్లోనే ఉండాలని.. ప్రధాని చెప్పినట్లు చేస్తే 21 రోజుల్లో ఈ మహమ్మారిని అంతం చేయొచ్చని చెప్పాడు. జైహింద్ అంటూ ముగించాడు కపిల్ శర్మ. బాలీవుడ్ లో ఇంకా స్టార్ హీరోలు కానీ హీరోయిన్లు కానీ ఆర్థిక సాయం విషయంలో ముందుకు రాలేదు.

More Related Stories