English   

కత్తి మహేష్ పై పోలీస్ పంజా

Kathi-Mahesh
2018-07-09 13:38:09

ప్రముఖ క్రిటిక్, వివాదాస్పద పొలిటికల్ అనలిస్ట్ కత్తి మహేష్ పై హైదరాబాద్ పోలీస్ లు నగర బహిష్కరణ విధించారు. ఈ మేరకు ఆయన్ని నగరం విడిచి వెళ్లాలని ఆదేశించారు. మళ్లీ తమ అనుమతి లేకుండా.. లేదా తాము అనుమంతిచేవరకూ కత్తిని హైదరాబాద్ రావొద్దని ఆదేశాలు జారీచేసినట్టు సమాచారం. అయితే ఈ విషయాన్ని ఇంకా పోలీసులు అఫీషియల్ గా కన్ఫార్మ్ చేయాల్సి ఉంది. మొత్తంగా రాముణ్ని దగుల్బాజీ అని,, సీత రావణుడి వద్దే ఉండి ఉంటే సంతోషంగా ఉండేది అని బాబు గోగినేని చెప్పిన మాటలను తన మాటల్లో ఉటంకించానని కత్తి మహేష్ చెబుతున్నా.. హిందూ సంఘాలు మాత్రం పూర్తిగా కత్తి మహేష్ నే టార్గెట్ చేసినట్టు కనిపించింది. ఈ నేపథ్యంలో హిందూ సంఘాలన్నీ కలిసి పోలీస్ లపై ఒత్తిడి తెచ్చాయి. దీంతో కొన్ని రోజుల క్రితం కత్తి మహేష్ ను పోలీస్ లు విచారించారు. ఈ విచారణ ఐదు రోజుల పాటు కొనసాగింది.  

ఇక కత్తి మహేష్ విషయాలో  కొన్నాళ్లుగా వస్తోన్న వివాదాల నేపథ్యంలో ముఖ్యంగా మతం రాముడు విషయంలో ఇవాళ డజిపి కూడా పోలీస్ లతో చర్చించారు. అలాగే రీసెంట్ గా జరిగిన విచారణ వివరాలు కూడా కనుక్కున్నారు.  ఇవాళ కత్తి మహేష్ ను నగరబహిష్కరణ విషయాన్ని పోలీస్ లు మీడియా ముఖంగా అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారు. అలాగే ఆయన్నిచిత్తూరు జిల్లాలోనే సొంత ఊరికి తరలించే ప్రయత్నాలూ చేస్తున్నట్టు సమాచారం. అయితే కత్తిపై ఆంధ్రప్రదేశ్ లో కూడా కొన్ని కేసులు నమోదు అయి ఉన్నాయి. దీంతో మరి అక్కడి పోలీస్ లు ఎలా స్పందిస్తారనేది కూడా ఆసక్తిగా మారింది. మరోవైపు కత్తి వ్యాఖ్యలను నిరసిస్తూ .. ధర్మాగ్రహ యాత్ర చేపట్టాలనుకున్న భారత్ టుడే ఛానల్ అధినేత.. పరిపూర్ణానంద స్వామిని కూడా ఆ యాత్రకు పర్మిషన్ లేదంటూ పోలీస్ లు గృహ నిర్బంధం చేశారు.. 

More Related Stories