English   

పూజా హెగ్డే ఫిగర్ కి రిపేర్స్

Pooja Hegde Concentrating on Her Body Shape
2018-08-01 07:22:15

పూజా హెగ్డే.. ఫస్ట్ మూవీలో పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోయినా.. తర్వాత దువ్వాడ జగన్నాథమ్ లో టూ పీస్ బికినీతో ఒక్కసారిగా టాలీవుడ్ కు హాట్ ఫేవరెట్ అయిపోయింది. జిగేల్ రాణిలోని జిగేల్స్ అన్నీ సోయగాలన్ని నిండి ఉన్న ఈ ట్యూటీకి డిజే తర్వాత టాలీవుడ్ లో పెద్ద హీరోలు కూడా ఫిదా అయ్యారు. దీంతో వరుసగా అవకాశాలు వెల్లువెత్తాయి. ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ సరసన అరవింద సమేత వీరరాఘవలో నటిస్తోంది. అలాగే మహేష్ బాబు 25వ సినిమాలో తనే హీరో. మరోవైపు బాలీవుడ్ లో కూడా లేటెస్ట్ గా ఓ కొత్త సినిమా ఒప్పుకుంది. ఇంత దూకుడుమీదున్న ఈ బ్యూటీకి సాక్ష్యం సినిమా షాక్ ఇచ్చింది. రిజల్ట్ పరంగా కాదు.. ఫిగర్ పరంగా.. 

సాక్ష్యం సినిమా బావుందనే టాక్ వచ్చింది. కలెక్షన్స్ కూడా బావున్నాయి. దీంతో ఈ భామ ఖాతాలో మరో హిట్ పడింది. కానీ ఈ సినిమాలో తన లుక్ చూసి అంతా షాక్ అయ్యారు. ఫిజిక్ అంతా బాగా తగ్గిపోయింది. అలాగే మేకప్ కూడా కొన్ని షాట్స్ లో ఎబ్బెట్టుగా ఉంది. లహరి సౌందర్యలహరి పాటలో తప్ప పెద్దగా అందం కూడా కనిపించలేదు. అటు ఎక్స్ పోజింగ్ విషయంలో కూడా తేడాగా ఉందీ బ్యూటీ. దీంతో ఈ విషయం పై చాలా సెటైర్స్ వచ్చాయి. ఈ విషయం తన వరకూ వెళ్లినట్టుంది. అందుకే కాస్త వెయిట్ గెయిన్ అవుతోందట. అంతేకాక ఇకపై తన సౌందర్యంపై మరింత శ్రద్ధ పెట్టేందుకు రకరకాల వ్యవహారాలు చేస్తోందట. అంటే మొత్తంగా తన ఫిగర్ కు రిపేర్స్ మొదలుపెట్టిందనుకోవచ్చు. నిజానికి సాక్ష్యంలో తన లుక్ నిజంగానే బాలేదనేది నిజం.. అయితే త్రివిక్రమ్ తన హీరోయిన్స్ అందం విషయంలో ఎక్కువ కేర్ తీసుకుంటాడు. కాబట్టి అరవింద సమేతలో ఆ ప్రాబ్లమ్ కనిపించకపోవచ్చు. అయినా సరే అందానికి ఎప్పటికప్పుడు మెరుగులు దిద్దకోకపోతే ఈ మెరుపుల ప్రపంచంలో ఇలా మెరిసి అలా మాయమైపోతారనేదానికి చాలామంది హీరోయిన్లు ఉదాహరణలుగా ఉన్నారు.

More Related Stories