English   

విజయ్ కోసం తెలుగు సినిమాను పక్కన పెట్టేసిన పూజా హెగ్డే

 Pooja Hegde
2021-03-04 13:56:35

తమిళ సూపర్ స్టార్ విజయ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమా వస్తే అభిమానులు పండగ చేసుకుంటారు. అంతే కాకుండా విజయ్ సినిమాల్లో నటించేందుకు కూడా హీరోయిన్ లు ఆసక్తి చూపిస్తారట. అవకాశం వచ్చిందంటే ఎగిరి గంతేస్తారట. అయితే ప్రస్తుతం విజయ్ హీరోగా నెల్సన్  దిలీప్ కుమార్ ఒక సినిమా ను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన ను ఎంపిక చేసారు. అయితే రష్మిక డేట్స్ ను సర్దుబాటు చేసుకోలేని కారణంగా ఆ ప్లేస్ లో ఇప్పుడు పూజ హెగ్డే ను తీసుకోవాలని అనుకుంటున్నారట. విజయ్ పక్కన అవకాశం కోసం ఎప్పటినుండో ఎదురు చూస్తున్న పూజా ఓ తెలుగు సినిమాను పక్కన పెట్టి మరీ విజయ్ సినిమాకు ఒకే చెప్పిందట. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఇదిలా ఉండగా పూజ 2012 లో కోలీవుడ్ లో మిస్కిన్ దర్శకత్వంలో మగమూడి అనే సినిమాలో నటించింది. కానీ ఆ సినిమా తరువాత అవకాశాలు రాలేదు. ఇక ఇప్పుడు ఏకంగా విజయ్ పక్కనే ఛాన్స్ కొట్టేసింది.

More Related Stories