English   

 అక్క‌డ పూజా.. ఇక్క‌డ కైరా.. 

pooja-hegde
2018-05-16 16:58:00

బాలీవుడ్ భామ‌ల‌కు ప్ర‌స్తుతం టాలీవుడ్ లో గిరాకీ బాగా పెరిగిపోయింది. మ‌న హీరోయిన్ల కంటే త‌క్కువ పారితోషికానికే వాళ్లు సినిమాలు చేస్తుండ టంతో వాళ్ల వైపు అడుగేస్తున్నారు ద‌ర్శ‌కులు. పైగా వాళ్ల‌తో సినిమాలు చేస్తే బాలీవుడ్ లోనూ సినిమాలు డ‌బ్బింగ్ చేసుకోవ‌చ్చు.. ఇప్ప‌టికే చేస్తున్నారు.. వాళ్ల మొహాలు కాస్త తెలుసు కాబ‌ట్టి క్రేజ్ కొంచెం ఎక్కువ‌గా ఉంటుంది. ఇక ఇప్పుడు ఇద్ద‌రు ముద్దుగుమ్మ‌లు తెలుగును పూర్తిగా ద‌త్త‌త తీసుకోవ‌డానికి ఫిక్సైపోయారు. వాళ్లే పూజాహెగ్డే అండ్ కైరా అద్వానీ. పూజా ఇప్ప‌టికే తెలుగమ్మాయి అయిపోయింది. డిజేతో పూర్తిగా త‌న మ‌కాం తెలుగు ఇండ‌స్ట్రీకి మార్చేసింది ఈ ముద్దుగుమ్మ‌. తాజాగా ఈమె ఎన్టీఆర్ సినిమా సెట్ లో అడుగు పెట్టింది. ఈ చిత్రంతో పాటు మ‌హేశ్ బాబు, ప్ర‌భాస్ సినిమాలు కూడా చేస్తుంది పూజా. ఇక కైరా అద్వానీ కూడా భ‌ర‌త్ అనే నేనుతో తెలుగు ఇండ‌స్ట్రీకి వ‌చ్చింది. ఇక్క‌డే సెటిల్ అయ్యేలా ఉంది. ఈమె కూడా ఈ మ‌ధ్యే రామ్ చ‌ర‌ణ్ సెట్ లో అడుగు పెట్టింది. బోయ‌పాటి శీను తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్రంలో కైరా హీరోయిన్. దాన‌య్య నిర్మాత‌. అటు త్రివిక్ర‌మ్ సినిమాలో పూజాహెగ్డే.. ఇటు బోయ‌పాటి సినిమాలో కైరా ఒకేసారి అడుగుపెట్టారు. ఈ రెండు సినిమాలు అక్టోబ‌ర్ లోపే పూర్తి కావాలి. పైగా అక్క‌డ ఎన్టీఆర్.. ఇక్క‌డ రామ్ చ‌ర‌ణ్.. ఇద్ద‌రూ అక్టోబ‌ర్ నుంచి రాజ‌మౌళి సినిమాతో బిజీ కావాలి. అబ్బా.. ఇది క‌దా ప‌క్కా స్క్రీన్ ప్లే లాక్ అంటే..!

More Related Stories