English   

ఎన్టీఆర్ కూడా పూజాహెగ్డేతోనే..!

NTR-pooja-hegde
2018-03-05 10:40:30

దేవుడా.. ఇప్పుడు పూజాహెగ్డే అదృష్టం చూసి మిగిలిన హీరోయిన్లు కుళ్లుకుంటారేమో..? లేక‌పోతే మ‌రేంటి.. ఒక్క హిట్ కూడా లేకుండా ఈ భామ చేస్తోన్న ర‌చ్చ చూసి అంతా షాక్ అవుతున్నారు. ఇండ‌స్ట్రీలో హిట్ ఉన్న ముద్దుగుమ్మ‌ల వెంటే ద‌ర్శ‌క నిర్మాత‌లు ప‌డ‌తారు అనేది అబ‌ద్ధం అని నిరూపిస్తుంది పూజాహెగ్డే. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ ఇండ‌స్ట్రీలో కూడా ఈ భామ‌కు ఒక్క హిట్ కూడా లేదు. ప్ర‌తీ ఒక్క‌రికి ఏదో ఓ టైమ్ లో ఓ సినిమాతో బ్రేక్ వ‌స్తుంది. పూజాహెగ్డేకు ఆ బ్రేక్ డిజేతో వ‌చ్చింది. సినిమా యావ‌రేజ్ గానే ఆడింది.. కానీ పూజా గ్లామ‌ర్ కు మాత్రం నూటికి నూరు మార్కులు ప‌డ్డాయి. అస‌లు ఈ భామ కోస‌మే సినిమా చూసినోళ్లు లేక‌పోలేదు. అంతగా రెచ్చిపోయింది ఈ బ్యూటీ. సినిమా ఎలా ఉన్నా.. పూజాహెగ్డే మాత్రం సూప‌ర్ హిట్ అయింది. అందాల ఆర‌బోత‌తో అరిపించేసింది.

ఈ సినిమా త‌ర్వాత కేవ‌లం ఆమె గ్లామ‌ర్ కోస‌మే అవ‌కాశాలు ఇస్తార‌న‌డంలో సందేహం లేదు. ప్ర‌స్తుతం తెలుగులో బెల్లంకొండ శ్రీ‌నివాస్ సాక్ష్యంలో న‌టిస్తుంది. రంగ‌స్థ‌లంలో ఐటం సాంగ్ లోనూ చిందేస్తుంది పూజాహెగ్డే. ఈ రెండు సినిమాల‌తో పాటు మ‌హేశ్ -వంశీ పైడిప‌ల్లి సినిమాలో హీరోయిన్ గా ఎంపికైంది. దిల్ రాజు నిర్మాత కావ‌డంతో పూజాకు ఇందులో అవ‌కాశం ద‌క్కింది. హీరోయిన్ల‌ను రిపీట్ చేయ‌డంలో రాజుగారు దిట్ట‌. ఎప్రిల్ నుంచి ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ విష‌యంపై అఫీషియ‌ల్ క‌న్ఫ‌ర్మేష‌న్ కూడా వ‌చ్చింది. ఇక ఇప్పుడు ఎన్టీఆర్-త్రివిక్ర‌మ్ సినిమాలోనూ పూజాహెగ్డేనే హీరోయిన్ గా తీసుకున్నారు. తాజాగా అఫీషియ‌ల్ క‌న్ఫ‌ర్మేష‌న్ వ‌చ్చేసింది. హారిక హాసిని క్రియేష‌న్స్ త‌మ ట్విట్ట‌ర్ లో పూజాహెగ్డేపై అఫీషియ‌ల్ అనౌన్స్ మెంట్ విడుద‌ల చేసారు. 

ఇక బాలీవుడ్ లోనూ పూజాహెగ్డే దూకుడు చూపిస్తుంది. అక్క‌డ ఇప్ప‌టికే హృతిక్ రోష‌న్ తో మొహింజ‌దారో లాంటి భారీ సినిమాలో న‌టించింది. అయితే ఆ సినిమా ప్లాప్ కావ‌డంతో మ‌ళ్లీ పూజా వైపు ఎవ‌రూ చూడ‌లేదు. కానీ ఫ్లాప్ హీరోయిన్ల‌కు ఎప్పుడూ ఆప‌ద్భాంద‌వుడిలా ఉండే స‌ల్మాన్ ఖాన్ క‌న్ను ఇప్పుడు పూజాహెగ్డేపై ప‌డింది. ఈయ‌న త్వ‌ర‌లోనే చేయ‌బోయే రేస్ 3 లో పూజాకు అవ‌కాశ‌మిచ్చిన‌ట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం పలువురు హీరోయిన్లు పోటీ పడినా అవకాశం మాత్రం పూజాకే దక్కడం పట్ల అందరూ షాక్ అవుతున్నారు. కెరీర్ క్లోజ్ అనుకుంటున్న టైమ్ లో స‌ల్మాన్.. మ‌హేశ్ లాంటి సూప‌ర్ స్టార్స్ పిలిచి ఆఫ‌ర్ ఇవ్వ‌డంతో అమ్మాయిగారి ఆనందానికి అవ‌ధుల్లేవు. మొత్తానికి పూజాకు ఫ‌లితం ఇన్నాళ్ల‌కు ద‌క్కుతుంద‌న్న‌మాట‌.

More Related Stories