English   

పూజా దూకుడు వెన‌క రీజ‌న్ అదే..!

Pooja-Hegde

ఇప్పుడు అంతా అనుకుంటున్న మాట ఇదే.. అస‌లు ఏం మాయ చేస్తుంది పూజాహెగ్డే..? ఒక్క హిట్ కూడా లేకుండా ఎందుకు ఆ భామ వెంట అంద‌రు హీరోలు ప‌డుతున్నారు..? అంటూ అంతా బుర్ర‌లు బాదుకుంటున్నారు. దీనికి స‌మాధానం ఒక్క‌టే. స‌మంత‌, కాజ‌ల్, త‌మ‌న్నా లాంటి ముద్దుగుమ్మ‌లంతా ఇప్పుడు ఓల్డ్ అయిపోయారు. ఇప్ప‌టికే వాళ్ల‌తో ఒక‌టికి రెండు సార్లు న‌టించేసారు మ‌న హీరోలు. దాంతో క‌చ్చింత‌గా కొత్త వాళ్ల‌కు చాన్స్ ఇవ్వాలి. ఇప్పుడున్న వాళ్ల‌లో పూజాహెగ్డే.. కైరాఅద్వానీ మిన‌హా మ‌న హీరోల‌కు పెద్ద‌గా ఆప్ష‌న్ క‌నిపించ‌ట్లేదు. ర‌కుల్ ను కూడా ఇప్పుడు లైట్ తీసుకోవ‌డంతో పూజానే అంద‌రికి ఆప్ష‌న్ గా మారుతుంది. ఇదే ఆమెకు వ‌రంగా మారిపోయింది. మ‌హేశ్ -వంశీ పైడిప‌ల్లి సినిమాలో పూజా హీరోయిన్ గా ఎంపికైంది. దిల్ రాజు నిర్మాత కావ‌డంతో పూజాకు ఇందులో అవ‌కాశం ద‌క్కింది. హీరోయిన్ల‌ను రిపీట్ చేయ‌డంలో రాజుగారు దిట్ట‌. ఎప్రిల్ నుంచి ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది. 

ఎన్టీఆర్-త్రివిక్ర‌మ్ సినిమాలోనూ పూజాహెగ్డేనే హీరోయిన్ గా తీసుకున్నారు. తాజాగా అఫీషియ‌ల్ క‌న్ఫ‌ర్మేష‌న్ వ‌చ్చేసింది. హారిక హాసిని క్రియేష‌న్స్ త‌మ ట్విట్ట‌ర్ లో పూజాహెగ్డేపై అఫీషియ‌ల్ అనౌన్స్ మెంట్ విడుద‌ల చేసారు. ఇక ఇప్పుడు మ‌రో ముద్దుగుమ్మే లేన‌ట్లు ప్ర‌భాస్ సినిమాలో కూడా ఈ భామ‌నే హీరోయిన్ గా తీసుకున్నారు. రాదాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌బోయే సినిమాలో పూజానే హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ చిత్రం మే నుంచి సెట్స్ పైకి వెళ్ల‌నుంది. సాహోతో పాటే ఈ సినిమాను కూడా ఒకేసారి పూర్తి చేయ‌నున్నాడు ప్ర‌భాస్. మ‌రోవైపు బాలీవుడ్ నుంచి కూడా ఆఫ‌ర్లు ప‌ల‌క‌రిస్తున్నారు ఈ ముద్దుగుమ్మ‌కు. కెరీర్ క్లోజ్ అనుకుంటున్న టైమ్ లో ఎన్టీఆర్.. మ‌హేశ్.. ప్ర‌భాస్ లాంటి సూప‌ర్ స్టార్స్ పిలిచి ఆఫ‌ర్ ఇవ్వ‌డంతో అమ్మాయిగారి ఆనందానికి అవ‌ధుల్లేవు. మొత్తానికి పూజాకు ఫ‌లితం ఇన్నాళ్ల‌కు ద‌క్కుతుంద‌న్న‌మాట‌.

More Related Stories