English   

కమల్ తో సహజీవనంపై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

 Pooja Kumar
2020-05-26 12:54:15

విలక్షణ నటుడు కమల్ హాసన్ ఇప్పటి వరకు ముగ్గురు హీరోయిన్లతో సహజీవనం చేశారు. ఇప్పుడు మళ్ళీ ఆయన మరో హీరోయిన్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు తమిళ మీడియా ఆ మధ్య కధనాలు వండి వార్చింది. దానికి కారణం లేకపోలేదు. కమల్ తన 65వ బర్త్‌ డే జరుపుకున్న సందర్భంగా పరమకూడిలో ఫ్యామిలీ మొత్తం గ్యాధర్ అయ్యారు. వారంతా కలిసి ఫ్యామిలీ ఫొటో దిగారు. ఈ ఫొటోలో ఒక హీరోయిన్ కూడా ఉండడంతో ఈ వార్తలకి బేస్ దొరికినట్టు అయ్యింది. ఆమె ఎవరో కాదు ప్రముఖ తమిళ నటి పూజా కుమార్. కమల్, పూజ జంటగా ‘విశ్వరూపం’ సినిమాలో నటించారు. అప్పుడే వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగినట్లు తెలుస్తోంది. గతేడాదిగా వీరిద్దరి మధ్య ఏదో నడుస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. 

ఎందుకంటే గతేడాదిగా కమల్ హాసన్ ఏ ముఖ్య కార్యక్రమాలకు వెళ్లినా పూజా కుమార్ ‌ఆయనకు తోడుగా వెళుతూనే ఉంది. తాజాగా బయటికి వచ్చిన వీరిద్దరి ఫొటో చూస్తే ఆ రూమర్స్ నిజమేనేమో అనేంతలా అక్కడి మీడియా కధనాలు ప్రసారం చేసింది. అయితే అప్పుడేమీ మాట్లాడని పూజా ఈ విషయం మీద తాజాగా క్లారిటీ ఇచ్చింది. తనకు కమల్ హాసన్ కుటుంబ సభ్యులు చాలా కాలం నుంచి తెలుసని, కమల్ సోదరుడు, ఆయన కుమర్తెలతో కూడా పరిచయం ఉందని చెప్పుకొచ్చింది. అందుకే వారి కుటుంబ వేడుకలకు నేను కూడా హాజరవుతుంటానని పూజా చెప్పుకొచ్చింది.

కమల్ తో కలిసి నటిస్తుండటం వల్ల మా ఇద్దరి మీద అఫైర్లు, డేటింగ్ అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని అసలు మా మధ్య అలాంటి రిలేషన్ లేదని చెప్పుకొచ్చింది. అవన్నీ రూమర్లే అంటూ పూజా కుమార్ చెప్పుకొచ్చింది. నిజానికి 1978లో కమల్ హాసన్ వాణి గణపతి అనే నటిని పెళ్లి చేసుకున్నారు. అయితే వీరికి పిల్లలు కలగాకుండానే పదేళ్ల తర్వాత ఇద్దరూ విడిపోయారు. ఆ తర్వాత నటి సారికను పెళ్లి చేసుకున్నారు. వీరికి శ్రుతి హాసన్, అక్షర హాసన్ జన్మించారు. ఆ తర్వాత సారికతోనూ కమల్ బంధం తెచ్చుకున్నారు. కొన్నాళ్ల అనంతరం నటి గౌతమితో సహజీవనం చేశారు. ఏమైందో ఏమో కానీ ఆమెతోనూ కమల్‌కు మనస్పర్ధలు ఏర్పడ్డాయి. దాంటో ఇటీవల కాలంలో వీరిద్దరూ తమ రిలేషన్‌కు ఫుల్ స్టాప్ పెట్టేశారు.  

More Related Stories