English   

పూన‌మ్ పూజ‌లు ఎవ‌రి కోసం

Poonam-Kaur

అనుకున్న‌ది జ‌ర‌గ‌న‌ప్పుడో.. అనుకోనిది జ‌రిగిన‌ప్పుడో.. మ‌నిషి ఆశ్ర‌యించేది రెండు విష‌యాలు. దేవుడు, డాక్ట‌ర్. ఇండియాలో మొద‌టిదాన్ని ఆశ్ర‌యించేవారే ఎక్కువ‌. మ‌రికొంత‌మంది బ్లాక్ మ్యాజిక్స్ అంటూ కూడా వెళుతుంటారనుకోండి అది వేరే విష‌యం. అయితే ఇప్పుడు నిన్న‌టి వ‌ర‌కూ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా ఉన్న పూన‌మ్ కౌర్ చేస్తోన్న పూజ‌లు కూడా హాట్ టాపిక్ అయిపోయాయి. ముఖ్యంగా ప‌వన్ క‌ళ్యాన్, క‌త్తి మ‌హేష్ ఇష్యూలో పూన‌మ్ పాత్ర పెద్ద‌దే. ఆ పాత్రే ప‌వ‌న్ పై అనేక అనుమానాల‌కు కార‌ణ‌మైంది. ఓ స్టార్ హీరో ఆమెకు ఏపి బ్రాండ్ అంబాసిడ‌ర్ గా ప‌ద‌వి ఇప్పించాడు అనేది క‌త్తి మ‌హేష్ ఆరోప‌ణ‌. మొద‌ట్లో క‌త్తికి ఆన్స‌ర్ ఇస్తూ కౌంట‌ర్స్ వేసిన పూన‌మ్.. త‌ర్వాత ఇమెచ్యూర్ గా వెళ్లి అడ్డంగా దొరికిపోయింది. త‌ర్వాత త‌ను కూడా క‌త్తికి ఊత‌మిస్తూనే కొన్ని ట్వీట్స్ చేసింది. ఆ త‌ర్వాత సొంత ప్రాంతానికి వెళ్లిన  ఈ బ్యూటీ రీసెంట్ గా ఓ చాన‌ల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో కూడా సెన్సేష‌న‌ల్ ఇష్యూస్ ను ఇన్ డైరెక్ట్ గా ట‌చ్ చేయ‌డం విశేషం. త్వ‌ర‌లోనే అంద‌రి బాగోతాలూ బ‌య‌ట‌పెడ‌తాను అన్న‌ట్టుగా మాట్లాడిన పూన‌మ్ లేటెస్ట్ గా చేస్తోన్న పూజ‌లు కూడా ప్రాధాన్య‌త సంత‌రించుకున్నాయి.

ఓ ప‌విత్ర పుణ్య‌క్షేత్రంలో పూన‌మ్ పూజ‌లు జ‌రిపించింది. ఇందుకోసం కుటుంబం స‌భ్యులు మాత్ర‌మే హాజ‌ర‌యిన‌ట్టు క‌నిపిస్తోంది. మ‌రి ఏ విష‌యంలో ఇలా పూజ‌లు జ‌రిపిందో తెలియ‌దు కానీ.. అవి బ‌య‌ట‌కు తెలిసేలా జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డ‌మే ఇప్పుడు డిస్క‌ష‌న్స్ కు కార‌ణం. త‌న‌కు బాగా కావాల్సిన వారి బాగు కోసం చేసిందా.. లేక త‌ను ట్వీట్ చేసిన‌ట్టు ఆడ‌వారి జీవితాల‌తో ఆడుకునేవారి చెడు కోసం చేసిందా అని ఎవ‌రికి వారు మాట్లాడేసుకుంటున్నారు.

More Related Stories