English   

సాక్షికి చేరిన బిత్తిరి సత్తి...అదే ప్లాన్ 

Anchor Bittiri Sathi
2020-07-11 12:45:24

ఒకప్పుడు వీ6 ఛానెల్ అనగానే మ‌న‌కు గుర్తుకు వ‌చ్చే బిత్తిరి స‌త్తి ఇప్పుడు టీవీ9లో చేరిపోయాడు. నిజానికి ఆయన అసలు పేరు రవి అనే విషయం కూడా చాలా మందికి తేలేదు. ఆయన సత్తి పేరుతోనే అంత ఫేమస్ అయిపోయాడు. అంతకు ముందు అడపాదడపా కొన్ని టీవీ చానెల్స్ ప్రోగ్రామ్స్ లో ఆయన మెరిసినా ఆయనకు ఎనలేని క్రేజ్ తెచ్చిపెట్టింది సత్తి క్యారెక్టర్. త‌న‌దైన శైలిలో తెలంగాణా యాస‌లో మాట్లాడుతూ అంద‌రినీ ఆక‌ట్టుకున్న బిత్తిరి స‌త్తి వల్లే వీ6కు టీఆర్పీ రేటింగ్‌లు కూడా పెరిగాయంటే అతిశయోక్తి కాదు. అయితే అనూహ్యంగా వీ6 చాన‌ల్‌కు గుడ్‌బై చెప్పి టీవీ9లో చేరిన స‌త్తిని టీవీ9 తొలగించింది. అయితే టాలెంట్ ఉన్నోడిని పట్టేయడానికి మిగతా చానెల్స్ ఎప్పుడూ రెడీగానే ఉంటయి కదా, అలానే సత్తిని సాక్షి ఛానెల్ రోప్ చేసింది. 

అయితే బిత్తిరిసత్తిని సాక్షి టీవీలోకి పెద్ద మొత్తమే చెల్లించి మరీ ఈయన్ని రోప్ చేసిందట. ఎందుకంటే తీన్మార్ వార్తలతో ఒక ట్రెండ్ సెట్ కాగా దానినే కాపీ చేస్తూ టీవీ 5లో మాస్ మల్లన్న, హెచ్ ఎం టీవీలో జోర్దార్ వార్తలు, టీవీ 9లో ఇస్మార్ట్ న్యూస్, టీ న్యూస్‌లో ధూంధాం ముచ్చట్లు ఇలా ప్రతి ఛానల్‌లోనూ ఒక్కో రకంగా తెలంగాణా స్టైల్ బులిటెన్ ఉంది. సాక్షిలో మాత్రం అలాంటి కార్యక్రమం ఏదీ లేదు. దీంతో బిత్తిరి సత్తి సాక్షికి వస్తే ఆ లోటు తీరబోతోందని భావిస్తున్నారు.

More Related Stories