English   

పోసాని కావాలనే అన్నాడా..? 

koratala-siva
2018-04-30 09:04:32

సాధార‌ణంగా మ‌హేశ్ సినిమాలు వివాదాల‌కు దూరంగా ఉంటాయి. మ‌రోవైపు కొర‌టాల శివ కూడా వీలైనంత వ‌ర‌కు వివాదాల‌కు దూరంగానే ఉంటాడు. కానీ ఇప్పుడు ఈ ద‌ర్శ‌కున్ని వివాదంలోకి లాగాడు పోసాని కృష్ణ‌ముర‌ళి. ఈయన కావాల‌ని అన్నాడో.. లేదంటే స‌మ‌యం క‌లిసొచ్చిందో తెలియ‌దు కానీ కోట్లాది మంది అభిమానులు చూస్తుండ‌గానే కావాల‌నే మాట‌ల తూటాలు పేల్చాడు పోసాని. భ‌ర‌త్ అనే నేను స‌క్సెస్ మీట్ లో కొర‌టాల శివ గురించి సంచ‌ల‌న విష‌యాలు చెప్పాడు పోసాని. ఈయ‌న త‌న పెళ్లి చేయ‌డంలో కూడా కీల‌క‌పాత్ర పోషించాడ‌ని ఓ వైపు కామెడీ చేస్తూనే.. మ‌రోవైపు సీరియ‌స్ విష‌యాలు కూడా డిస్క‌స్ చేసాడు. కొర‌టాల ఇండ‌స్ట్రీకి వ‌చ్చి చాలా సంపాదించాడ‌ని అంతా అనుకుంటార‌ని.. కానీ చాలా పోగొట్టుకున్నాడ‌ని చెప్పి షాకిచ్చాడు పోసాని. నిజానికి కొర‌టాల శివ కేవ‌లం పోసానికి శిష్యుడే కాదు.. మేన‌ల్లుడు కూడా. అందుకే ఆయ‌న గురించి ప్ర‌తీ విష‌యం ఈయ‌న‌కు తెలిసే ఉంటుంది. 

ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన త‌ర్వాత కొర‌టాల నుంచి క‌థ‌లు చాలా మంది దోచేసార‌ని చెప్పి సంచ‌ల‌నం సృష్టించాడు పోసాని కృష్ణ‌ముర‌ళి. లేక‌పోతే ఈ పాటికి ప‌ది సూప‌ర్ హిట్ సినిమాలు చేసేవాడ‌ని చెప్పాడు ఈయ‌న‌. అంత‌టితో ఆగ‌కుండా కొర‌టాల వైపు చూస్తూ ఏరా నిజం కాదా.. నువ్వే చెప్తావా ఇవ‌న్నీ అంటూ ప‌ల‌క‌రించాడు. పోసాని ఇన్ డైరెక్ట్ గా విమ‌ర్శ‌లు చేసింది బోయ‌పాటి మీదే అని వార్త‌లొస్తున్నాయి. ఎందుకంటే గ‌తంలో కూడా బోయ‌పాటిపై నిప్పులు చెరిగాడు పోసాని. అంతేకాదు.. కొర‌టాల కూడా సింహా సినిమాకు తాను రాసిన క‌థ‌, మాట‌ల‌కు క్రెడిట్ ఇవ్వ‌లేద‌న్నాడు. దానికి ముందు భ‌ద్ర‌కు కూడా ఇదే ప‌రిస్థితి. మొత్తానికి ఇప్పుడు పోసాని చేసిన క‌మెంట్స్ తో మ‌రోసారి బోయ‌పాటి కాంట్ర‌వ‌ర్సీకి కేంద్రబిందువుగా మారాడు. 

More Related Stories