English   

టెమ్ట్ రాజాలో ఐ లవ్ యూ రాజా

posani krishna
2020-10-23 10:22:52

తెలుగులో ఓటిటి రాకతో బూతు సినిమాలు పెరిగాయనే చెప్పాలి. ఓటీటీ లో కాంపిటీషన్ పెరిగిందనో లేదంటే హిందీలో వచ్చి రీమేక్ చేసిన మంచి బూతు కంటెంట్ ఉన్న వెబ్ సిరీస్ "మీర్జాపూర్" హిట్ అయ్యిందనో దర్శకులందరూ అదే ఫార్ములాను వాడుతున్నారు. తాజాగా మరో బూతు కంటెంట్ ఉన్న సినిమా రెడీ అయింది. అదే "టెమ్ట్ రాజా". ఈ సినిమాను ఫీమేల్ ఓరియెంటెడ్ చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. సే క్రియేషన్స్ బ్యానర్ పై ఏ ఆర్కే ఆర్ట్స్ సమర్పణలో ఈ సినిమా వస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా వుంది. అయితే తాజాగా ఈ సినిమా పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. కాగా పోస్టర్ లో నటుడు పోసాని కృష్ణ మురళి కనిపించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. 

ఈ సందర్భంగా నిర్మాత, హీరో రాంకీ మాట్లాడుతూ...నేను హీరోగా నటించి నిర్మించిన ఈ సినిమా అందరికీ నచ్చుతుందని నేను నమ్ముతున్నాను. ఈ సినిమాలో డిగ్రీ కాలేజ్ సినిమా హీరోయిన్ దివ్యా రావు తో పాటు సెకండ్ హీరోయిన్ గా అస్మ నటించింది. అంతే కాకుండా సినిమాలో జయవాని, పోసాని కృష్ణ మురళి, జోగి బ్రదర్స్ ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమాకు హరి గౌర స్వరాలను అందించారు" అని రాంకీ వెల్లడించారు. ఇక బోల్డ్ కంటెంట్ తో వస్తున్న ఈ సినిమా ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో చూడాలి.

More Related Stories