English   

పోసాని కృష్ణమురళి సంచలన నిర్ణయం

Posani-Krishnamurali
2018-04-14 16:09:57

రచయితగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అందించిన రచయిత పోసాని కృష్ణమురళి. తన డైలాగ్స్ తో ఎన్నో సినిమాలను విజయవంతం చేసిన టాలెంటెడ్. బాగా చవుదుకున్న వ్యక్తిగానూ పోసానికి మంచి పేరుంది. నటుడుగా మారిన తర్వాత పెన్ కు గ్యాప్ ఇచ్చిన పోసాని.. నటుడుగానూ ఎన్నో సినిమాల్లో అదిరిపోయే నటనతో ఆకట్టుకున్నాడు. ఏ విషయాన్నైనా నిర్మొహమాటంగా చెప్పడంలో, ఎవరికీ భయపడని తత్వంలో పోసాని తర్వాతే ఎవరైనా.. మనిషి రఫ్ గా కనిపిస్తాడు కానీ, మనసు వెన్న అని దగ్గర్నుంచి చూసిన వారు చెబుతారు. అలాంటి పోసాని లేటెస్ట్ గా ఓ సెన్షేషనల్ డెసిషన్ తీసుకున్నాడు. అతను ఇండస్ట్రీకి వచ్చిన మూడు దశాబ్ధాలు దాటిపోయింది. ఇప్పుడా మూడు దశాబ్ధాలను రికార్డ్ చేయబోతున్నాడు.. అంటే తన అనుభవాలను ఆత్మకథగా చెప్పబోతున్నాడు. పోసాని కృష్ణ మురళి ఇండస్ట్రీకి వచ్చి 34యేళ్లు. ఈ మొత్తం కాలంలో తనకు ఎదురైన అనుభవాలు, అనుభూతుల్ని నిర్మొహమాంటగా రాయబోతున్నాడు. ఇన్నాళ్లూ తను పనిచేసిన దర్శకులు, నిర్మాతలు, ఆర్టిస్టులను గురించి కూడా పేరుపేరునా ఈ ఆత్మకథలో చెబుతాడట. అంతే కాదు.. ఇన్నాళ్లలో తను చేసిన తప్పులను కూడా ఏ మాత్రం దాయకుండా రాస్తాడట. మొత్తం వెయ్యి పేజీలుగా ఉండబోయే ఈ ఆత్మకథలో ఎన్నో సంచలన విషయాలు కూడా ఉంటాయని చెబుతున్నారు. ఏదేమైనా పోసాని ఏం చేసినా సెన్షేషనల్ గానే ఉంటుంది. అన్నట్టు ఈ ఆత్మకథ పేరు ఏంటో తెలుసా.. ‘‘మెంటల్ కృష్ణ’’.. యాప్ట్ టైటిల్.. కదా.. 
 

More Related Stories