English   

థియేటర్ లో చూసుకుందాం.. రా..?

Ee-Nagaraniki-Emaindi
2018-04-26 17:25:17

పెళ్లి చూపులుతో ఎంటైర్ టాలీవుడ్ ను ఆకట్టుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్. ఫస్ట్ మూవీ అయినా బెస్ట్ గా తీశాడనే పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత తరుణ్ కు ఉక్కిరిబిక్కిరయ్యే అవకాశాలు వస్తాయనుకున్నారు చాలామంది. కానీ రాలేదు. మొదటి సినిమానే ఢక్కా మొక్కీలు తిని విడుదల చేసుకున్న తరుణ్ కు రెండో సినిమ సురేష్ బాబు చేయడం అందుకు ఓ కారణం. నెక్ట్స్ సినిమా నాకే అన్న కమిట్ మెంట్ మీదే అతను పెళ్లి చూపులు సినిమాను విడుదల చేశాడు. మొత్తంగా 2016లో వచ్చిన పెళ్లి చూపులు తర్వాత తరుణ్ మరో సినిమా పూర్తి చేయడానికి రెండేళ్లు పట్టింది. సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ లోనే తెరకెక్కిన ఈ మూవీకి ‘ఈ నగరానికేమైంది’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తో వస్తోంది. నీ గ్యాంగ్ తో రా థియేటర్ కి, చూసుకుందాం అనే క్యాప్షన్ కూడా ఉంది. లేటెస్ట్ గా ఈ మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేశారు.  నలుగురు కుర్రాళ్ల కథగా పోస్టర్ ను బట్టి తెలుస్తోంది. వారి చేతిలో ట్రై ప్యాడ్, క్లాప్ బోర్డ్ తో పాటు షూటింగ్ మెటీరియల్ కూడా కనిపిస్తోంది. అంటే సినిమాపై ప్యాషనేట్ గా ఉన్న కుర్రాళ్ల కథ అని కూడా అనుకోవచ్చు.  ఇందులో నటిస్తోన్న కుర్రాళ్లంతా కొత్తవాళ్లే. ఇప్పటి వరకూ ఫస్ట్ మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టిన కుర్ర దర్శకుల్లో చాలామంది ద్వితీయగండం చూశారు. మరి తరుణ్ భాస్కర్ అది దాటతాడా లేదా అనేది చూడాలి. 

More Related Stories