English   

ప్ర‌భాస్ పై ప‌గ‌బ‌ట్టిన బాలీవుడ్ ద‌ర్శ‌కుడు..

prabhas
2018-02-27 20:09:11

ప్ర‌భాస్ ను చూస్తుంటే ఎవ‌రికైనా ప‌గ ప‌ట్టాల‌నిపిస్తుందా.. అస‌లు కోప్ప‌డాల‌నిపిస్తుందా.. ఎంత‌ కూల్ గా ఉంటాడు ప్ర‌భాస్..? ఇన్ని సినిమాలు చేసినా ఏ రోజు కూడా చిన్న వివాదంలో కూడా ఇరుక్కోలేదు ఈ హీరో. కానీ ఇప్పుడు బాలీవుడ్ లో ఓ అగ్ర ద‌ర్శ‌కుడు ప్ర‌భాస్ పై సెటైర్లు వేస్తున్నాడు. ఆయ‌నే క‌ర‌ణ్ జోహార్. ఇద్ద‌రూ మొన్న‌టి వ‌ర‌కు పాలు నీళ్ల‌లా క‌లిసున్నారు కానీ ఇప్పుడు ఉప్పు నిప్పులా మారిపోయారు. నువ్వు ఎంతంటే.. నువ్వెంత అనుకునేంత వైరం వీళ్ల మ‌ధ్య పెరిగింద‌ని తెలుస్తుంది. దానికి కార‌ణం సాహో సినిమానే. ఈ చిత్రాన్ని ముందు బాలీవుడ్ లో క‌ర‌ణ్ జోహార్ విడుద‌ల చేస్తాన‌ని చెప్పాడు. బాహుబ‌లితో ఉన్న ప‌రిచ‌యంతో ప్ర‌భాస్ కూడా స‌రే అన్నాడు. కానీ దీనికి ప్ర‌భాస్ చెప్పిన రైట్స్ రేటు ఆయ‌న‌కు న‌చ్చ‌లేద‌ని తెలుస్తుంది. బాలీవుడ్ సినిమాల‌కు కూడా షాక్ అయ్యేలా రేట్ చెప్పాడు ప్ర‌భాస్. దాంతో క‌ర‌ణ్ ఉలిక్కిప‌డి సాహోను విడుద‌ల చేయ‌డం లేద‌ని చెప్పాడ‌ని తెలుస్తుంది.

దాంతో పాటు ప్ర‌భాస్ తో బాలీవుడ్ లో ఓ సినిమా చేయ‌డానికి క‌ర‌ణ్ ఎప్ప‌ట్నుంచో ప్లాన్ చేసుకుంటున్నాడు. అన్నీ కుదిర్తే సాహో త‌ర్వాత తాను బాలీవుడ్ సినిమా చేస్తాన‌ని కూడా చెప్పాడు యంగ్ రెబ‌ల్ స్టార్. అయితే ఇప్పుడు అది ఇర‌కాటంలో ప‌డింది. క‌ర‌ణ్ తో సినిమా చేయ‌డానికి ప్ర‌భాస్ ఏకంగా 20 కోట్ల‌కు పైగానే రెమ్యున‌రేష‌న్ అడిగేస‌రికి క‌ర‌ణ్ జోహార్ షాక్ అయ్యాడ‌ని తెలుస్తుంది. బాలీవుడ్ లోనే చాలా మంది యంగ్ హీరోల‌కు ఈ స్థాయి రెమ్యున‌రేష‌న్ ఇవ్వ‌రు. అలాంటిది ప్ర‌భాస్ అంత అడిగేస‌రికి క‌ర‌ణ్ షాక్ అయ్యాడ‌ని.. నువ్వేం అయినా ర‌జినీకాంత్ అనుకుంటున్నావా అంటూ ప్ర‌భాస్ కు డైరెక్ట్ గా క‌ర‌ణ్ సెటైర్లు వేసాడ‌ని తెలుస్తుంది. ఇక ట్విట్ట‌ర్ లో కూడా డియ‌ర్ ఆంబిష‌న్.. నువ్వేమైనా సాధించాలంటే ముందు నీవు లెజెండ్స్ తో పోల్చుకోవ‌డం మానేయ్ అంటూ ప్ర‌భాస్ ను ఉద్దేశించి ఓ ట్వీట్ కూడా వేసాడు క‌ర‌ణ్. ఇదంతా చూస్తుంటే ఈ వివాదం ఇక్క‌డితో ఎండ్ కార్డ్ ప‌డేలా క‌నిపించ‌ట్లేదు.

More Related Stories