English   

అనుష్క విషయంలో ప్రభాస్ ఎందుకిలా చేస్తున్నాడు.. 

Prabhas-Anushka-Shetty
2018-08-10 12:06:53

ప్రభాస్ అనుష్కల జంట గుంటూర్ మిర్చిలా హాట్ గా ఉంటుందని అందరికీ తెలుసు. వీరి మధ్య కెమిస్ట్రీ ఏ రేంజ్ లో ఉంటుందో వారి సినిమాలు చూసిన ఎవరికైనా అర్థమవుతుంది. బాహుబలి రెండు భాగాల తర్వాత వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే రూమర్స్ బలంగా వినిపించాయి. ఆశ్చర్యంగా ఈ ఇద్దరూ వాటిని ఖండించలేదు. మరోవైపు ప్రభాస్ ఇంట్లో వారికి అతను అనుష్కను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదనే గాసిప్స్ కూడా వినిపించాయి. దీనికి తోడు ఇద్దరూ ఇప్పటికే పెళ్లి వయసు దాటినా ఇంకా చేసుకోలేదు. అంటే తమ పెళ్లికి ఎప్పటికైనా పెద్దలను ఒప్పించాలనే పట్టుదలతో ఉన్నారనేవారూ లేకపోలేదు. నిజానికి ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అభిమానులు కూడా బలంగా కోరుకుంటున్నారు. ఆ విషయాలన్నీ పక్కన బెడితే ఇప్పుడు ప్రభాస్.. అనుష్క విషయంలో పూర్తిగా మారిపోయాడనే మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

అనుష్కకు ప్రభాస్ అంటే చాలా ఇష్టం.. అని అందరికీ తెలుసు. అది కో స్టార్ గానా... పెళ్లి చేసుకునేంత ఇష్టమా అనేది ప్రస్తుతానికి అప్రస్తుతం. కానీ ప్రస్తుతం ప్రభాస్ మాత్రం అనుష్కను కావాలనే అవాయిడ్ చేస్తున్నాడంటున్నారు. తనకు సంబంధించిన ఊసులు తన చుట్టుపక్కల లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. అంటే అనుష్క గురించి ఎవరైనా మాట్లాడినా.. ఆమె ప్రస్తావన తన వద్ద వచ్చినా చిరాకు పడుతున్నాడట. అలాగే ఏదైనా ఫంక్షన్ కు వెళ్లాలంటే అనుష్క వస్తుందా లేదా అని ఆరాలు తీసి.. తను రాకుంటేనే ఇతను వెళుతున్నాడని విశ్వసనీయంగా తెలుస్తోంది. మరి ప్రభాస్ అనుష్కను ఎందుకు అవాయిడ్ చేస్తున్నాడు. ఇద్దరూ కలిసి వెళితే పెళ్లిపై రూమర్స్ వస్తాయనా..? లేక చేసుకోవాలనుకున్న పెళ్లి ఆగిపోయిందా..? లేక ఇంకేదైనా రీజన్ ఉందా..? వీటన్నిటికీ సమాధానం కాలమే చెబుతుంది. 

More Related Stories