English   

ప్రభాస్ సినిమా సెట్ కి అన్ని కోట్లా

prabhas
2020-01-22 19:27:48

సాహో లాంటి భారీ బడ్జెట్ సినిమా తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమా జాన్.  ఇంకా అధికారికంగా టైటిల్ ఫిక్స్ చేయని ఈ సినిమాకి జాన్ అనే వర్కింగ్ టైటిల్ తో సంభోదిస్తున్నారు. ఇక సాహో ప్రమోషన్స్ దృష్ట్యా ఆగిన ఈ సినిమా షూట్ సాహో రిజల్ట్ కి చానాళ్లు ఆగిపోయింది. అయితే 'జాన్' సినిమా షూటింగ్ హైదరాబాద్ లో మొన్ననే మొదలయింది. అయితే ఇది వింటేజ్ లవ్ స్టోరీ అని మొదటి నుండి చెబుతున్నారు. అయితే తాజాగా అందిన సమాకాహరం ప్రకారం ఈ సినిమా కధ అంతా యూరప్ నేపథ్యంలో నడుస్తోందట. కొంతకాలం క్రితం యూరప్ లో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ఇప్పుడు అదే సెట్ లో కూడిన సన్నివేశాలను చిత్రీకరించడానికి ఇక్కడే అన్నపూర్ణ స్టూడియోస్ లో భారీ సెట్ వేశారు. అంటే కథ సెట్ లో కాకుండా యూరప్ లో నడుస్తున్నట్టుగానే ఉండే ఫీల్ తేవలాని ప్రయత్నిస్తున్నారట. ఆ ఫీల్ ను తీసుకురావడానికి ఈ సెట్ కోసం రూ. 3 కోట్ల వరకూ ఖర్చు పెట్టారని అంటున్నారు. ప్రత్యేకమైన ఈ సెట్లో షూటింగ్ పూర్తయిన తరువాత షెడ్యూల్ కోసం ఆస్ట్రియా వెళ్లనున్నారని అంటున్నారు. అక్కడే ఉంది అక్కడ పర్మిషన్స్ అలాగే యూనిట్ మొత్తం అద్దె ఖర్చులు పెట్టే బదులు ఇదే మంచి నిర్ణయం అని భావించి ఇక్కడే సెట్ వేయించారట ప్రభాస్.

 

More Related Stories