English   

జాతిర‌త్నాలు హీరోయిన్ పై ప్ర‌భాస్ కామెంట్స్

prabhas
2021-03-04 18:50:52

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ తాజాగా జాతి ర‌త్నాలు సినిమా ట్రైల‌ర్ ను విడుద‌ల చేసారు. ప్ర‌భాస్ త‌న‌ ఇంట్లో ఒక న‌వారు మంచంపై కూర్చొని 'జాతిర‌త్నాలు' ట్రైల‌ర్‌ను ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా హీరోయిన్ ఫ‌రీనా అబ్దుల్లాను చూసి, "ఈమేంటి ఇంత పొడ‌వుంద"‌ని ఆశ్చ‌ర్యం ప్ర‌క‌టించారు. ట్రైల‌ర్‌ను చూసి, "సూప‌ర్‌.. చాలా బాగుంది" అని ప్ర‌శంసించారు. "టీజ‌ర్ నాకు గుడ్ అనిపించింది. ట్రైల‌ర్ అయితే ఎక్స్‌ట్రార్డిన‌రీగా ఉంది. సూప‌ర్బ్‌. ట్రైల‌ర్ చూసి ప‌దిసార్లు న‌వ్వానంటే, సినిమా ఇంకెంత‌సేపు న‌వ్విస్తుందో ఊహించుకోవాల్సిందే. సినిమా అంతా హిలేరియ‌స్‌గా ఉంటుంద‌ని అనుకుంటున్నాను.

కోవిడ్ త‌ర్వాత ఫ్యామిలీ అంతా వెళ్లి హాయిగా న‌వ్వుకొంటూ ఎంజాయ్ చేసే సినిమా అనుకుంటున్నాను. డైరెక్ట‌ర్ అనుదీప్‌కు, యాక్ట‌ర్స్‌కు, ప్రొడ్యూస‌ర్ నాగ్ అశ్విన్‌కు, ఎంటైర్ యూనిట్‌కు బెస్ట్ విషెస్ చెప్తున్నానని అన్నారు‌. ఆయ‌న చేతుల మీదుగా ట్రైల‌ర్ లాంచ్ అయినందుకు యూనిట్ అమితానందాన్ని వ్య‌క్తం చేసింది. ఇక ఈ సినిమాలో టాంలెంటెడ్ హీరో న‌వీన్ పొలిశెట్టి హీరోగా న‌టించాగా రాహుల్ రామ‌కృష్ణ‌, ప్రియ‌ద‌ర్శి కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఇక ఈ సినిమాకు నిర్మాత‌గా ఉన్న నాగ్ అశ్విన్ ప్ర‌భాస్‌తో పాన్ ఇండియా మూవీని తెర‌కెక్కిస్తున్నారు. 

More Related Stories