English   

ప్రభాస్ సాహో సర్‌ప్రైజ్‌ వచ్చేసింది!

Prabhas
2019-05-21 13:12:07

బాహుబలి సిరీస్ తో వరల్డ్ వైడ్ ఫేమస్ అయిన ప్రభాస్ ఒకప్పుడు ఫేస్‌బుక్ మాత్రమే వాడుతూ సోషల్‌మీడియాలో అంతగా యాక్టివ్‌గా ఉండేవాడు కాదు. ఈ మధ్యే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ఓపెన్ చేసిన ఆయన మీకోసం రేపు ఓ సర్‌ప్రైజ్ ఉందని నిన్న ప్రకటించాడు. అలా ప్రకటించినట్టుగానే ఆయన సాహో పోస్ట‌ర్ విడుద‌ల చేస్తూ రిలీజ్ డేట్ ప్ర‌క‌టించాడు. ఆగ‌స్ట్ 15న సాహో చిత్రం విడుద‌ల కానుంద‌ని పేర్కొంటూ ఒక లుక్ రిలీజ్ చేశారు. ఇక ఆ కొత్త లుక్‌లో ప్ర‌భాస్ స‌రికొత్త‌గా క‌నిపిస్తున్నాడు. సాహో చిత్రం యాక్ష‌న్ ఎంటర్టైన‌ర్‌గా రూపొందుతుండ‌గా, శ్ర‌ద్ధా క‌పూర్ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్న ఈ సినిమాలో నీల్ నితిన్ ముకేశ్, అరుణ్ విజయ్, ఎవ్‌లిన్ శర్మ, జాకీ ష్రాఫ్, చుంకీ పాండే వంటి టాప్ స్టార్స్‌ ప్రధాన పాత్రల్లో న‌టిస్తున్నారు. ఈ సినిమాను తెలుగు, హిందీ, తమిళంతో పాటు పలు ఇతర భాషల్లో ఒకేసారి విడుదల చేసేందుకు చిత్ర నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ ఏర్పాట్లు చేసుకుంటోంది. ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా చివ‌రి షెడ్యూల్‌ని అక్క‌డే పూర్తి చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది.  

More Related Stories