English   

ప్రభాస్ భారీ మల్టీస్టారర్

prabhas

యంగ్ రెబల్ స్టార్ ఏం చేసినా సంచలనమే అవుతోందిప్పుడు. బాహుబలి తర్వాత నేషనల్ వైడ్ గా ఇమేజ్ సంపాదించుకున్న ప్రభాస్ బాలీవుడ్ లోనూ పరిచయం కాబోతున్నాడనే వార్త చాలాకాలంగా వినిపిస్తోన్నదే. అందుకు తగ్గట్టుగానే ఎప్పటి నుంచో స్క్రిప్టులు కదుపుతున్నాడీ రెబల్ స్టార్. ప్రస్తుతం సాహోతో సగం బాలీవుడ్ సినిమా చేస్తున్నాడా.. అన్నంతగా సాగుతోందీ సినిమా షూటింగ్. ఒక రకంగా చెప్పాలంటే సాహోతో ప్రభాస్ హాఫ్ బాలీవుడ్ ఎంట్రీ పూర్తయినట్టే. అయితే ఆ మిగతా సగం ఎంట్రీకి కూడా రంగం సిద్ధం అవుతున్నట్టు సమాచారం. కాకపోతే ఈ రెండోదాన్నే అఫీషియల్ ఎంట్రీగా చెప్పాలేమో. మరి ప్రభాస్ చేయబోయే ఆ బాలీవుడ్ సినిమా ఏది.. ఎవరితో.. 

బాహుబలి టైమ్ లో ప్రభాస్ ను బాలీవుడ్ కు పరిచయం చేస్తానని మాటిచ్చాడు దర్శక నిర్మాత కరణ్ జోహార్. ఆ మాటకు కట్టుబడి తర్వాత కొన్ని కథలు కూడా వినిపించాడు. కానీ ప్రభాస్ కు నచ్చలేదు. ఫైనల్ గా ఇప్పుడు ఓ కథ వద్ద ప్రభాస్ ఆగినట్టు సమాచారం. అయితే ఇది మల్టీస్టారర్ అంటున్నారు. మరి ప్రభాస్ తో నటించే ఆ స్టార్ ఎవరో తెలుసా..? రణ్ వీర్ సింగ్. యస్.. రణ్ వీర్ సింగ్, ప్రభాస్  హీరోలుగా కరణ్ జోహార్ ఓ సినిమా రూపొందించబోతున్నట్టు బాలీవుడ్ నుంచి స్ట్రాంగ్ న్యూస్ వినిపిస్తోంది. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండబోయే ఈ సినిమాకు దర్శకుడు మాత్రం కరణ్ కాదట. 

ప్రస్తుతం ప్రభాస్ సాహో చేస్తున్నాడు. దీని తర్వాత రాధాకృష్ణ డైరెక్షన్ లో ఓ పీరియడ్ ఫలిమ్ చేయబోతున్నాడు. 1980స్ బ్యాక్ డ్రాప్ లో సాగే ప్రేమకథ ఇది. ఈ సినిమా పూర్తికావడానికి వచ్చే యేడాది సమ్మర్ వరకూ పడుతుంది. ఆ తర్వాత కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ లో రణ్ వీర్ సింగ్ తో కలిసి నటించే మల్టీస్టారర్ ఉంటుందని టాక్. కాకపోతే ఈ మేటర్ ను కరణ్ ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు.. 

More Related Stories