English   

జులైలో ప్ర‌భాస్ నిశ్చితార్థం.. 

2017-04-01 07:35:36

ప్ర‌భాస్ పెళ్లి మ్యాట‌ర్ మ‌ళ్లీ తెర‌పైకి వ‌చ్చింది. ఏకంగా దీన్ని నేష‌న‌ల్ ఇష్యూగా మార్చేస్తున్నారు మ‌న ద‌ర్శ‌క‌నిర్మాత‌లు. ప్ర‌భాస్ పెళ్ళికి ఉన్న క్రేజ్ గ‌మ‌నించి ఆవుపులి మ‌ధ్య‌లో ప్ర‌భాస్ పెళ్ళి అంటూ కొత్త ద‌ర్శ‌కుడు ఎస్ జే చైత‌న్య ఆ మ‌ధ్య ఓ సినిమానే తీసాడు. ప్ర‌భాస్ కు ఉన్న క్రేజ్ ను వాడుకోవ‌డానికే ఇలాంటి టైటిల్ పెట్టాడ‌నేది స్ప‌ష్ట‌మ‌వుతుంది. ఆ సినిమా ప్ర‌భాస్ ఉత్తుత్తి పెళ్లి పై వ‌చ్చింది. కానీ ఇప్పుడు నిజంగానే ప్ర‌భాస్ పెళ్లి కొడుకు అవుతున్నాడు. ఇదేదో గాలి వార్త కాదు. స్వ‌యంగా ప్ర‌భాస్ పెద‌నాన్న కృష్ణంరాజు చెప్పిన మాట‌. అన్నీ అనుకున్న‌ట్లు జ‌రిగితే జులైలోనే ప్ర‌భాస్ నిశ్చితార్థం జ‌ర‌గ‌బోతుంది. 

37 ఏళ్లొచ్చినా ఇంకా ప్ర‌భాస్ కు పెళ్లి కాలేదు. ఆ మ‌ధ్య ఓ సంబంధం వ‌చ్చింద‌నే వార్త‌లొచ్చినా అందులో నిజం లేదు. మ‌రోవైపు బాహుబ‌లి 2 పూర్త‌య్యే వ‌ర‌కు పెళ్లి చేసుకోనని ఆ మ‌ధ్య ప్ర‌భాస్ క్లారిటీ ఇచ్చాడు. ఇన్ని క‌న్ఫ్యూజ‌న్స్ మ‌ధ్య కృష్ణంరాజుకు మాటిచ్చేసాడు ప్ర‌భాస్. నేను పెళ్లికి రెడీ అంటూ ఇంట్లో వాళ్ల‌కు తీపిక‌బురు చెప్పాడు యంగ్ రెబ‌ల్ స్టార్. ఇప్ప‌టికే ప్ర‌భాస్ కోసం ఓ అమ్మాయిని చూసి పెట్టార‌ట కృష్ణంరాజు అండ్ ఫ్యామిలీ. 

ఈ అమ్మాయి కూడా రాజుల కుటుంబం నుంచి వ‌చ్చిందే.. ఎంసిఏ చ‌దువుకున్న ఈ చిన్న‌ది కంప్యూట‌ర్ ప్రొఫెష‌న‌ల్ అని తెలుస్తోంది. ప్ర‌భాస్ హైట్ కు ఈడుజోడుగా ఉంటుంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌న యంగ్ రెబ‌ల్ స్టార్ కు సైతం ఈ అమ్మాయి బాగా న‌చ్చేసింద‌ని టాక్. బాహుబ‌లి 2 విడుద‌లైన వెంటనే ప్ర‌భాస్ అభిమానుల‌కు పెళ్లి క‌బురు చెప్ప‌నున్నాడు. ఈ ఏడాదే వాడు పెళ్లి పీట‌లెక్క‌బోతున్నాడంటూ కృష్ణంరాజు కుండ బ‌ద్ద‌లు కొట్టేసాడు. మొత్తానికి టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్ కు ఇన్నాళ్ల‌కు పెళ్లి వైపు మ‌న‌సు మ‌ళ్లింద‌న్న‌మాట‌. మ‌రి ఈ రాజుగారికి స‌రిపోయే ఆ రాణిగారు ఎక్క‌డున్నారో..?

More Related Stories