English   

ప్రభాస్.. తేజూను హర్ట్ చేశాడా..?

prabhas hurted teju
2018-05-31 16:13:47

చూస్తుంటే అలాగే ఉంది. ఈ మెగా కుర్రాడిని హర్ట్ చేసింది ఎవరో తెలుసా.. ప్రభాస్. యస్.. ప్రభాస్ వల్లే సాయిధరమ్ తేజ్ హర్ట్ అయ్యాడు. సడెన్ గా ఈ మేటర్ ట్విట్టర్ లోకి కూడా వచ్చాడు. ప్రభాస్ తో తనకేం సబంధం లేదని ఓ ఓపెన్ ట్వీట్ కూడా చేశాడు. ఇంతకీ మేటర్ ఏంటో తెలుసా.. ప్రస్తుతం తేజూ, కరుణారన్ దర్శకత్వలో తేజ్ ఐలవ్యూ అనే సినిమా చేస్తున్నాడు కదా.. ఈ సినిమా ఫస్ట్ లుక్ వచ్చిన దగ్గర్నుంచీ అతని చేతిలో గిటార్ తో పాటు ఓ మైక్ కూడా కామన్ గా కనిపిస్తోంది. ఇదే లుక్ గతంలో ప్రభాస్ డార్లింగ్ సినిమాలో కూడా కనిపించింది. ఆ సినిమాకూ దర్శకుడు కరుణాకరనే కదా. అందుకే ఇది డార్లింగ్ సినిమాకు సీక్వెలా అంటూ చాలామంది సెటైర్స్ వేస్తున్నారు. దీంతో తేజూ బాగా హర్ట్ అయిపోయాడట. 

ఈ సెటైర్స్ మరీ శ్రుతిమించక ముందే తనే ట్వీట్ చేశాడు. తన చేతిలో మైక్, గిటార్ ఉన్నా.. ఈ సినిమా డార్లింగ్ కాదు.. తేజ్ ఐలవ్యూ.. అంటూ ఈ సినిమాక ఆ సినిమాకూ ఏ సంబంధం లేదని చెప్పేశాడు. బట్ చూస్తుంటే లుక్ మాత్రం అలా ఉందంటూ చాలామంది ఆ లుక్ తో పోలికలు వేస్తూ మరీ కమెంట్స్ పెడుతున్నారు. ఏదేమైనా ప్రభాస్ డార్లింగ్ తో తన సినిమాను కంపేర్ చేసినందుకు తేజూ చాలా హర్ట్ అయినట్టున్నాడు. అయినా..  అసలే హిట్లు లేక ఇబ్బంది పడుతోంటే ఎంతో నమ్మకం పెట్టుకున్న సినిమాపైనా కమెంట్స్ చేస్తోంటే అవడా మరి..

More Related Stories